ప్రియురాలి నగ్నచిత్రాలు చూపించి...

దుబాయ్: మాజీ ప్రియురాలి నగ్నచిత్రాలు చూపించి, తనని పెళ్లిచేసుకోవాలని వేధిస్తున్న శ్రీలంక దేశస్థుడికి దుబాయ్ కోర్టు మంగళవారం 6 నెలల జైలు శిక్ష విధించింది. భారత్‌కు చెందిన 23 ఏళ్ల యువతి, ఈత శిక్షకుడు(34) అయిన ఆ వ్యక్తి గతంలో సన్నిహితంగా ఉండేవారు. అప్పట్లో ఆమె నగ్న చిత్రాలను అతను తీశాడు. ఇప్పుడు వాటిని చూపించి, తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే ఆ చిత్రాలను కుటుంబసభ్యులకు చూపిస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు.

అంతేకాక ఆ ఫొటోలను అతను తన మామ ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ యువతి సోదరికి కూడా పంపాడు. నిందితుడు డబ్బు కోసం తనను బెదిరించాడని ఆమె కోర్టుకు తెలిపింది.

Popular posts from this blog

SBI పోర్టల్‌కు "ఐ బొమ్మ" లింక్!!

సానియా మీర్జాపై మ‌ళ్లీ నెటిజ‌న్ల ఫైర్‌.. ఎందుకంటే..?

The 2012 pole shift has started