కరీనా కపూర్‌కు వీహెచ్‌పీ సలహా : కోర్టులో దావా వేసుకోమని!



బాలీవుడ్ నటి కరీనా కపూర్‌కు విశ్వహిందూ పరిషత్ నేతలు ఓ ఉచిత సలహా ఇచ్చారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ప్రచురితమయ్యే మహిళా మ్యాగజైన్ కవర్ పేజీపై కరీనా చిత్రాన్ని మార్ఫింగ్ చేసి ప్రచురించడం వివాదం కావడంతో ఈ సలహా ఇచ్చారు.


ముద్రించే హిమాలయ వాహిని మ్యాగజైన్‌ కవర్ పేజీపై కరీనా కపూర్ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి ప్రచురించడాన్ని వీహెచ్‌పీ సమర్థించుకుంది. 'ఈ విషయంలో ఏదైనా సమస్య ఉందని నటి కరీనా కపూర్ భావిస్తే, కోర్టు తలుపులు ఆమె కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి' అని వీహచ్‌పీ నేత ప్రకాష్ శర్మ హితవు పలికారు.

'లవ్ జిహాద్' అంటూ హిందూ యువతులను ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకొని మతం మార్చుకునేలా కొందరు ముస్లింలు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ, తాజా సంచికలో ముఖ చిత్రంగా కరీనాను చూపింది. కరీనా కపూర్ వివాహం సైఫ్ అలీ ఖాన్‌తో జరుగగా, ఆపై కరీనా తన పేరును కరీనా కపూర్ ఖాన్‌గా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ముఖ చిత్రంలో కరీనా సగం ముఖంపై బురఖా ఉన్నట్టు చూపారు. దాని కింద 'ధర్మాందరన్ సే రాష్ట్రాంతరన్' అని కాప్షన్ ఇచ్చారు. దీనిపై కరీనా మాత్రం ఇంకా స్పందించలేదు.

*** for More Updates Click Here

Popular posts from this blog

కొంపముంచిన మతిమరుపు.!

SBI పోర్టల్‌కు "ఐ బొమ్మ" లింక్!!

The 2012 pole shift has started