150 వ సినిమా రహస్యం!
లవ్ పై డిఫరెంట్ సినిమా తీయాలని ఒక డైరెక్టర్ కంకణం కట్టుకున్నాడు.రచయితకి కాకితో కబురంపితే,రెక్కలు కట్టుకుని వాలాడు. "హీరోయిన్ ని హీరో ప్రేమిస్తాడు.కానీ అది ప్రేమని తెలియదు.హీరోపై హీరోయిన్ కి ఇది.అదేంటో తెలీయదు."చెప్పాడు డైరెక్టర్. "ఎవరికీ ఏమీ తెలీయక పోవడమే సినిమాకి సగం బలం."అన్నాడు రచయిత. "ఏమీ తెలీయకపోయినా ముద్దుల వరకూ వస్తారు." "ముద్దులతో ప్రారంభమైన ప్రతి ప్రేమా చివరికి మిస్టరీగా ముగుస్తుంది." "హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఒకాయనకి బాగా తెలుసు.ఆయనో ఫిజిక్స్ లెక్చరర్.ఈయన రకరకాల ఉపన్యాసాలతో,ఫ్లాష్ బ్యాక్ లతో సినిమాను ముందుకు నడిపిస్తుంటాడు." "ఈయనకి వేరేపని లేదా?" "ప్రేమికులని కలపడమే పని" "కంటికి కనిపించేదేదీ నిజంకాదనే ఫిలాసఫర్ ఒకాయనుంటాడు.ఈయన విలన్." "ప్రేమించి పెళ్ళిచేసుకున్న తరువాత లవర్సే విలన్లు.మళ్ళీ వేరే విలన్లు అవసరమా?" "లాజిక్ ని తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోరు.హీరో లేకపోయినా చూస్తారుకానీ,విలన్లు లేకపోతే చూడరు.మన విలన్ వయసులో ఉన్నప్పుడు ఆరుగురుని ప్రేమించాడు." "ఆరుగురూ తిరస్...