Posts

Showing posts from 2011

150 వ సినిమా రహస్యం!

లవ్ పై డిఫరెంట్ సినిమా తీయాలని ఒక డైరెక్టర్ కంకణం కట్టుకున్నాడు.రచయితకి కాకితో కబురంపితే,రెక్కలు కట్టుకుని వాలాడు. "హీరోయిన్ ని హీరో ప్రేమిస్తాడు.కానీ అది ప్రేమని తెలియదు.హీరోపై హీరోయిన్ కి ఇది.అదేంటో తెలీయదు."చెప్పాడు డైరెక్టర్. "ఎవరికీ ఏమీ తెలీయక పోవడమే సినిమాకి సగం బలం."అన్నాడు రచయిత. "ఏమీ తెలీయకపోయినా ముద్దుల వరకూ వస్తారు." "ముద్దులతో ప్రారంభమైన ప్రతి ప్రేమా చివరికి మిస్టరీగా ముగుస్తుంది." "హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఒకాయనకి బాగా తెలుసు.ఆయనో ఫిజిక్స్ లెక్చరర్.ఈయన రకరకాల ఉపన్యాసాలతో,ఫ్లాష్ బ్యాక్ లతో సినిమాను ముందుకు నడిపిస్తుంటాడు." "ఈయనకి వేరేపని లేదా?" "ప్రేమికులని కలపడమే పని" "కంటికి కనిపించేదేదీ నిజంకాదనే ఫిలాసఫర్ ఒకాయనుంటాడు.ఈయన విలన్." "ప్రేమించి పెళ్ళిచేసుకున్న తరువాత లవర్సే విలన్లు.మళ్ళీ వేరే విలన్లు అవసరమా?" "లాజిక్ ని తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోరు.హీరో లేకపోయినా చూస్తారుకానీ,విలన్లు లేకపోతే చూడరు.మన విలన్ వయసులో ఉన్నప్పుడు ఆరుగురుని ప్రేమించాడు." "ఆరుగురూ తిరస్...

దేవుడికే దడ పుట్టింది!

స్వర్గ లోకం లో అన్ని రాష్ట్రాల దేవుళ్ళు కూర్చుని మూడు ముక్కలాట ఆడుకుంటున్నారు. ఇంతలో 'పెద్ద ' దేవుడొచ్చి..."ఇక మీదట మీకు టైం పాస్ కావాలంటే పేకాడాల్సిన అవసరం లేదు. రేపు మన లోకానికి ఒక హోం థియేటర్ తెప్పిస్తున్నాను. హాయిగా సినిమాలు చూడొచ్చు" అన్నాడు. చేతుల్లొ ఉన్న పేకలు గాల్లొకి ఎగరేసి చప్పట్లు కొట్టి ఈలలు వేసారు దేవుళ్ళందరూ. పెద్ద దేవుడు - "మీరంతా ఈ సారి సెలవులకు మీ మీ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి మంచి మంచి సినిమాలు పట్టుకురండి. అందరివి చూసాక అందులో బెస్ట్ అనిపించుకున్నవి మాత్రం ప్లే చేస్తాను...ఎమంటారు" అన్నాడు. మిగతా దేవుళ్ళంతా "హై హై నాయకా..హై హై నాయకా" అని అరుచుకుంటూ వెళ్ళిపొయ్యారు. తెలుగు దేవుడు ఆంధ్రప్రదేశ్ లో దిగాడు. ప్రయాణం వల్ల బాగా అలసిపొయ్యినట్టున్నాడు. ఒళ్ళు విరుచుకుని, పక్కన్నే ఉన్న టే కొట్టుకు వెళ్ళాడు. ఒక టీ చెప్పి, న్యూస్ పేపర్ తీసాడు..ఊళ్ళో ఏ తెలుగు సినిమాలు ఉన్నాయో చూద్దామని. ఉన్న వాటిలొ సగానికి పైగా డబ్బింగ్ సినిమాలు. 'ప్రేమ సంయోగం', 'వీర దంచుడు ', 'జాతీయ పాట ' టైటిల్స్ మాత్రం గుర్తుండిపొయా...

రు.700 కోట్ల జగన్ మహల్!

Image
అక్కడెక్కడో ముకేశ్ అంబానీ భారీ భవంతిని కట్టాడని గొప్పలు చెప్పుకున్నాం కానీ, మనకు తెలియకుండానే, మన పక్కనే ఓ భారీ భవంతిని జగన్ నిర్మించాడని తెలుసుకోలేకపోయాం. జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై సీబీఐ విచారణ పుణ్యమా అని.. ఆ విషయం బయటపడింది. అత్యంత ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కలిసే.. లోటస్ పాండ్ దగ్గర ఉంది మనం చెప్పుకుంటున్న మహాసౌథం. అందుకే.. ఈ మహల్ కు లోటస్ మహల్ అని పేరు పెట్టుకున్నాడు జగన్. పైకి చూడడానికి మాములుగానే కనిపించినా, విషయమంతా అందులోకి వెళ్లిన వారికే తెలుస్తుంది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఈ నివాసంలోకి కొన్ని రోజుల క్రితం ప్రవేశించారు. 52263 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఐదంతస్తుల రాజభవనాన్ని చూసి వారు అవాక్కయ్యారు. ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు వెళ్లడానికి సౌకర్యం కోసం పెద్ద సంఖ్యలో లిఫ్ట్ట్లులు, ఎస్కలేటర్లు ఉన్నాయి. 200 సీటింగ్ కెపాసిటీ గల ఓ మినీ థియేటర్, లైబ్రరీ, జిమ్, స్క్వాష్, టెన్నిస్,వాలీబాల్ కోర్టులు ఇందులోకి ప్రవేశించిన వారికి కనిపిస్తాయి. దాదాపు 30 బెడ్ రూములు ఈ మహల్లో ఉన్నాయి. దీని నిర్మాణంలో భాగంగా 24 బోగీల మార్భుల్...

కొంపముంచిన మతిమరుపు.!

Image
హాల్‌టికెట్ మరిచిపోయి ఎగ్జామ్‌కు వెళితే? పెనాల్టీతోనైనా ఎగ్జామ్ ఫీజు చెల్లించే ఆ చివరి రోజు కూడా మరిచిపోతే...? రిసీవ్ చేసుకోవడానికి కచ్చితంగా స్టేషన్‌కు వస్తానని చెప్పి, ఏ ఊరో వెళ్లిపోతే...? వ్యాపారి టాక్స్ చెల్లించాల్సిన లాస్ట్‌డేట్ మరిచిపోతే...? మ్యారేజ్ డే అన్న విషయమే మరిచిపోయి శ్రీవారు ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకుంటే..? అన్నీ అతి ముఖ్యమైనవే! అయినా మరిచిపోవడమేమిటి? అదే మరి! కొన్ని విషయాలను మరిచిపోవడం వల్ల భారీ మూల్యమే చెలించుకోవలసి వస్తుంది. వాటిలో కొన్ని తిరిగి పూడ్చుకునే అవకాశమే లేని నష్టాలు కావచ్చు. నిజానికి ఆ నష్టాల గురించి తెలియకపోవడం కూడా కాదు. అయినా మరిచిపోతుంటాం. ఒక విద్యార్థి ఫీజు కట్టడం మరిచిపోతే ఒక విద్యాసంవ త్సరమే చేజారిపోయినట్లే కదా! ఒక సంవత్సరం వృధాగా గడిచిపోయాక వచ్చే సంవత్సరం నాటికి ఆలోచనలు మారిపోవనేమీ లేదు కదా! పరిస్థితులు మారిపోవచ్చు. ఏడాది తరువాత మళ్లీ ఆ దిశగా వెళ్లడం సాధ్యమే కాకపోవచ్చు. అహోరాత్రులు ఎంతో కష్టపడి చదివి, హాల్‌టికెట్ లేకుండా ఎగ్జామ్‌కు వెళితే ఏమిటి పరిస్థితి? మ్యారేజ్ డే మరిచిపోయిన శ్రీవారికి ఇంక ఆ ఏడాది పొడవునా వే ధింపులూ సాధింపులే ...

చీమలూ ... నిధులూ..!

Image
బంగారం తవ్వే 'చీమల' గురించి ఒక పురాగాథ ఉంది. భారతదేశంగా భావించబడే ఒక ఎడారి ప్రాంతంలో ఒకనాడు ఇసుకలో కలిసిపోయి బోలెడు బంగారం ఉండేదట. విపరీతమైన వేడి, ఉక్క ఉండే ఆ ప్రాంతంలో ఈ 'చీమలు' తప్ప వేరే జంతువులు ఉండేవి కావట. అవి కుక్కల కంటే చిన్నగా నక్కల కంటే పెద్దగా ఉండేవట. చాలా వేగంగా పరిగెత్తగలిగేవట. ఎండ పెరిగేకొద్దీ అవి ఇసుకను తొలుచుకుంటూ లోపల్లోపలికి వెళ్లిపోతే అడుగు ఇసకంతా పైకొచ్చి పడేదట. సరిగ్గా అవి లోపలికి వెళ్లిపోయి కునుకు తీసే సమయానికి పసిడి వేటగాళ్లు మూడు ఒంటెల సవారీ కట్టుకెళ్లి బంగారంతో నిండిన ఆ ఇసుకనంతా మూటలు గట్టుకుని వచ్చేసేవారట. ఆ 'చీమల' చేతచిక్కితే చావే కాబట్టి తమ ఒంటెల్లో ఒకటి బాలింత ఒంటె ఉండేలా చూసుకునేవారట. అది బిడ్డ మీద తీపితో ప్రాణాలకు తెగించి పరిగెత్తి వాళ్లను ఎలాగోలా క్షేమంగా తిరిగి తీసుకొచ్చేదట. *** 2500 ఏళ్ల క్రితం హెరొడొటస్ రాసిన ఈ కథనాన్ని చాలా శతాబ్దాల వరకు ఎవరూ నమ్మలేదు. కథో కల్పనో అనుకున్నారు. అబద్ధాలకోరు అని కూడా అన్నారు. కాని కొన్నేళ్ల క్రితం సింధునది ఎగువన భారత-పాకిస్తాన్ సరిహద్దులో ఒక అధ్యయన బృందానికి సరిగ్గా అటువంటి ఇసుక, అటు...

ఎన్నారైసింహారెడ్డి!

ఒరేయ్ AT&Tగా,  నువ్విచ్చే బోడి పెయిడ్ డీల్సు ఎవడిక్కావాల్రా? ఎత్తి కొట్టానంటే నువ్వూ, నీ సర్క్యూట్సూ పనికిరాకుండాపోతైరా. ఆ తర్వాత గోక్కోటానికి వైర్లు చేతిలో ఉన్నా పీక్కోటానికి ఒక్క కస్టమరూ ఉండర్రా. నేను ఇండియాలో ఫ్రీ కాల్సు చేసుకున్నా, ఇక్కడికొచ్చి మీ ఊళ్ళో చేసుకున్నా, మా ఫ్రెండ్సుతో కలిసి చేసుకున్నా, సింగిల్గా కూడా చేసుకున్నా. ఒరేయ్, నువ్వే గనక ఓ దమ్మున్న ఫోను కంపనీవోడివైతే, నీకే గనక నన్ను ఫ్రీ ఫోన్ కాల్సు చేసుకోకుండా  ఆపగలిగే కెపాసిటీ ఉంటే, రారా...ఈ రోజు ఈ ఎన్నరైగాడో నువ్వో తేలిపోవాలి. అరేయ్ RI గుర్తుపట్టావా, నేను NRI గాణ్ణిరా., నేను ఫోనెత్తి హలో..... అని దారుణంగా నోరు తెరిచి పిలిస్తే ఆ పిలుపు వినలేక దెబ్బకి చెవులు చిల్లులుపడి చస్తావ్రా. నేను పర్సనల్గా వచ్చి మాట్లాడటమేంట్రా. ఇండియా కాల్ కోసం డబ్బు తగలెయ్యకుండా ఫ్రీగా చేసుకోటం ఎలాగో నాకు మా ఫ్రెండ్ అమెరికా పాలతో ఇక్కడికొచ్చిన మొదటి రోజే నేర్పాడ్రా. నేను ఇండియాకి ఫ్రీగా యాహూలో మాట్లాడా, జీ మెయిల్లో మాట్లాడా. మరీ తిక్కరేగితే ఆఫీసు ఫోనుతో కూడా మాట్లాడా. ఇవ్వాళ ఉన్నపళంగా పెయిడ్ కాల్సు అంటే యెవడు ఒప్పుకుంటాడ్రా...

భాషాభిమానం!

Image
"... ఇందుకోసం కూడా తెలుగు భాషను మనలో ప్రతి ఒక్కరం మరింత బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం'' మైకులో ఒక పెద్దాయన గొంతు వినబడుతోంది. తెలుగు భాష ఔన్నత్యం, ఆవశ్యకతలపై జరుగుతున్న సదస్సు అది. పొద్దున్నించి దేశభాషలందు తెలుగు ఎందుకు లెస్సో (ఇంగ్లీషు లెస్ కాదు) అందరూ చెప్పీ చెప్పీ వినీ వినీ అలిసిపోయి ఉన్నారు. ఇది మధ్యాహ్నం సెషన్. అన్నపూర్ణ లాంటి తెలుగు భోజనం తిని, తెలుగు భుక్తాయాసంతో, తెలుగు నిద్రామైకంలోకి జారుకుంటుండగా ఈ మాటలు వినిపించాయి. ఠక్కున లేచి కూర్చున్నారందరూ. తెలుగు గొప్పతనం గురించి, తెలుగును బతికించుకోవాల్సిన అవసరం గురించి ఇంతమంది కవులు, కథకులు, పండితులు, భాషావేత్తలు చెప్పని ఏ కొత్త విషయాన్ని ఆయన చెప్పబోతున్నాడో వాళ్లకు అర్థం కాలేదు. ఊపిరి బిగబట్టి చెవులు రిక్కించారు. "నేనో రాజకీయ నాయకుడ్ని. నాకు వ్యాకరణం, పద్యం, శైలి, శిల్పం వగైరాల గురించి తెలియదు. కాని తెలుగు భాష మాత్రం ఉండి తీరాలి. వేరే ఏ భాషలోనూ నాకు తిట్లు రావు. అలాగే నేను ఎవర్నయినా పొగడాలన్నా, ఎవరైనా నన్ను పొగడాలన్నా... వీటి అవసరం ప్రతిరోజూ ఉంటూనే ఉంటుంది... తెలుగు భాష నాకూ వాళ్లక...

India’s Population Reality!

WORLD POPULATION DAY-TODAY IT REMINDS US OF OUR SHARED RESPONSIBILITY TO CARE FOR EACH OTHER AND OUR PLANET Smaller Default Larger This year’s World Population Day falls during a milestone year, when we anticipate the birth of the earth’s seven-billionth inhabitant. This is an opportunity to celebrate our common humanity and our diversity. It is also a reminder of our shared responsibility to care for each other and our planet. It provides us an opportunity to analyze our successes and our failures. This year’s World Population Day has more significance for India, because the results of Census-2011 have just been released which provide a fertile ground for an assessment of our current demographic situation and future challenges. 
The provisional population figures of the 2011 Census do suggest that India’s population growth is finally slowing down. Although the total population size exceeded most projections, the growth rate has slowed compared to the 1990s. This is largely due t...

చిరంజీవి కొత్త సినిమా!

చిరు రాజకీయ అజ్నాని. ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా సరిగా తెలియదు. సమస్యలపై అవగాహనా తక్కువే. ఇలా భావించేవాళ్లంతా ఇక చిరు పట్ల ఇక తమ ద్రుక్పథాన్ని మార్చుకోవాలేమో. ఎందుకంటే ఇక నుంచి చిరు సరిగ్గా మాట్లాడే అవకాశముంది. రాజకీయంగానూ సరైన అడుగులు వేసేలా కనిపిస్తున్నాడు. కారణం..  చిరు కొత్తగా నియమించుకున్న రాజకీయ గురువే. అతడే పీసీసీ పీఠాధిపతి బొత్స. ఇంతకుముందు కేవలం రాజకీయ సలహాదారుగా మాత్రమే పనిచేసిన సత్తిబాబు ఇప్పడు పూర్తిస్థాయి గురువు బాధ్యతలను స్వీకరించినట్టు సమాచారం. ఇక నుంచి మెగాస్టారు సత్తిబాబు చెప్పినట్టే  నడుచుకుంటాడట. అలాగని అతడు బొత్స అడుగులకు మడుగులు ఎత్తుతాడని చెప్పి చిరు అభిమానులను నొప్పించను  కానీ పరస్పర ప్రయోజనాలను ద్రుష్టిలో ఉంచుకుని ఒకరికొకరు పూర్తి స్థాయిలో సహకరించుటకైతే ఒక అంగీకారం కుదిరినదట. ఇక ఎప్పడు బొత్స మీట నొక్కితే అప్పడే  చిరు స్వరం ఢిల్లీలో గానీ.. హైదరాబాదులో గానీ వినిపించును. భగవంతునికి, భక్తునికి అనుసంధానం టైపులో ఇక బొత్సకు, చిరుకు మధ్య ఎవరూ లేకపోయినా అప్పడప్పడు ఆ అనుసంధానపు బాధ్యతలను ఘంటా శ్రీనివాసు నిర్వహించునని తెలుస్తున్నది. ప్రజారాజ్యం పోయి....

ఈ పదాలకు పల్స్ రేట్ లేదు!

నా దగ్గర దేహం ఉంది నీ దగ్గర జీవం ఉందా? వద్దొద్దు..కంగారు పడకు నాకు తెలుసు నీ దగ్గర ఏమీ లేదని. నువ్వూ నాలాంటి వాడివేనని.అయినా మనం భయపడాల్సిన పనేమీలేదు ఎందుకంటే మన దగ్గర దోచుకొనేదేమీ లేదు కాబట్టి రకరకాల విబజన రేకల్లో కోతకు గురయ్యాక మనిషి దగ్గర ఇంకేం మిగులుతుంది?కల్లు కరువు దేసాల్లా సిధిలమైపోయాయి. కన్నీళ్ళు మైళ్ళ లోతుల్లో ఇంకిపోయాయి.లైఫ్ ఈజ్ ఎ బ్రాండ్.నువ్వూ నేనూ ఈ భూమ్మేద టెంపరరీ కస్టమర్స్.జేబులో సొమ్మయిపోగానే మొహం మీదే షట్టర్ మూసేస్తారు.నీలో సరుకు అయిపోయిందా,ప్రపంచం ఇరుకైపోతుంది.గుర్తుంచుకో,చిర సుపరిచిత ప్రపంచంలో  అపరిచితులం మనం.లైఫ్ను పేస్లుగా ఎడిట్ చేస్తే లేయర్స్ లోపల నవ్వుల్లేవ్ పువ్వుల్లేవ్,ప్రెమల్లేవ్.ఎవ్రిథింగ్ డిస్కనెచ్టెడ్ సోకాల్డ్ సివిలైజేషన్. నరాలు తెగినట్టు,వెన్నెముక విరిగినట్టు,గుండె జారినట్టు,నెత్తురు ఆవిరీయినట్టు ప్రెషర్ కుక్కర్లో ఉడికీ ఉడికీ కెంద్ర నాడీ వ్యవస్త కుప్పకూలుతున్న ఇండికేషన్స్.టో మెనీ కాంప్లికేషన్స్.

పొలిటికల్(నో కామెంట్స్!)

పొలిటికల్(నో కామెంట్స్!) ఎన్ని విగ్రహాలు పగలగొడితే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది? ఎంత పెద్ద సునామీ వస్తే ఈ రాజకీయనాయకులందరూ కొట్టుకుపోతారు? ఒక కొత్త పార్టీ పెడితే ఎన్ని లక్షల కోట్లు దోచుకోవచ్చు? ఎన్ని తిట్లు తిడితే రాజకీయనాయకులకు బుద్ది వస్తుంది? ఎన్ని దీక్షలు చేస్తే ఈ ప్రభుత్వం దిగివస్తుంది? ఎంత అవినీతి సొమ్ము సంపాదిస్తే మంచి పేరు వస్తుంది? ఒక పార్టీని మరొక పార్టీలో కలిపితే ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు? ఒక రాజకీయనాయకునిపై పోలీసు కేసు పెట్టాలంటే ఎంత పెద్ద సాక్ష్యం కావాలి? ఎంత పెద్ద విద్వంసం చేస్తే అది ఒక ఉద్యమం అవుతుంది?

మాటలనుండి మౌనంలోకి

మాటలనుండి మౌనంలోకి ఆ రోజులు గుర్తొచ్చినప్పుడల్లా అదో దిగులు.ఆ రోజులు ఎప్పటికీ తిరిగిరావు.ఇప్పుడు కాస్త అర్దమవుతుంది ఈ దిగులు. "ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతంకాదని.కొత్త రోజు రింగవుతుంది.అంతా ప్రీపెయిడ్.కాలం కస్టమర్ కేర్ లా గైడ్ చేస్తుంది.బైటకి వెళ్ళాలంటే బండి ఆటో స్టార్ట్ ప్రెస్ చేయండి.ప్రమోషన్ రావాలంటే కంప్యూటర్ కీబోర్డ్ అరిగేదాకా ప్రెస్ చెయండి.ఇంటికి వచ్చేముందు ఏ.టి.యం. నెంబర్ ప్రెస్ చెయండి.ప్రెస్,ప్రెస్,ప్రెస్ ఒత్తిడి.తిరిగి హోం మెనూ లోకి రావాలంటే అంతా గజీ,బిజీ.ఈ వత్తిడిలో డ్రాఫ్ట్ నుండి నీ కాల్ వస్తుంది.మైండ్ రీస్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూనే తర్వాత మాట్లాడతా. ఓపిగ్గా నీ మాటలు వినాలని,చెప్పాలనిపించి నా మనసు కార్డ్ స్క్రాచ్ చెసి చూస్తే అన్నీ లెక్కతప్పిన అంకెలే. ముందుంచు బూతులు మైనస్లో పడి కలవరపెడతాయి.నా గతం కాల్ డైవర్ట్ అయి ఇప్పటి వరకూ ఎలా గడిచిందీ కాలం? ఇప్పుడేంటిలా ఏదో పనిలో ఉండగా సెల్ వైబ్రేషన్ లా వళ్ళంతా పాకి ఉలిక్కిపడుతున్నాను.ఎంటో చెప్పు సెల్ని చెవికప్పగించి కంప్యూటర్ లోనుంచి తలతిప్పకుండా నీ లోకంలోకి 'ఎంటర్ ' అయేందుకు విశ్వప్రయత్నం ...

ఫిబ్రవరి దేవుడు!

ఫిబ్రవరి దేవుడు దేవుడు ఒకసారి మన భూమిమీదకి రావాలనుకున్నాడు.దేవుడంటే మన అందరి దిక్కూ మొక్కూ అయిన ఆ దేవుడే.అందుకోసం ముందుగానే షెడ్యూల్ ప్రకటించాడు. ముందుగా మన భారతదేశంలో పర్యటించాలనుకున్నాడు.పెద్ద రాష్ట్రాలయితే రెండు రోజులు,చిన్న రాష్ట్రాలయితే ఒక్క రోజు చొప్పున షెడ్యూల్ ఉంది.ఈ విషయం రహస్యం అయితే ఎవరూ తనను పట్టించుకోరని ముందుగా మీడియా వాళ్ళందరికీ ఈ విషయం లీక్ చేశాడు.మీడియా వాళ్ళు ఈ విషయం గంటకోసారి చొప్పున 24 గంటలూ టాం.టాం. వేశేశారు. ఫిబ్రవరి 1.అందరూ ఎదురుచూస్తున్నారు ఆ రోజు కోసం. ఆ రోజు రానే వచ్చింది.ముందుగా ఆంద్రప్రదేశ్ లో పర్యటిస్తున్నాడు.అడిగిన వారికి అడిగినన్ని ఇచ్చేస్తున్నాడు.ఒకాయన మారుతీ 800 కారు అడిగి తీసుకెళ్ళాడు,ఇది తెలిసి వాళ్ళావిడ అతన్ని నానా తిట్లు తిట్టి అంతటి దేవుడు వరాలు ఇస్తుంటే ఏ టాటా ఇన్నోవా కారో అడక్క ఇది ఎందుకు తెచ్చారు?అని తిట్టిపోసింది.ఈ ముత్యాలహారం ఏంచేసుకోను? సాక్షాత్తూ ఆ దేవుడే దిగి వచ్చి మనకు వరాలు ఇస్తుంటే ఏ వజ్రాల హారమో అడక్క ఇది ఎందుకు తెచ్చారు? అని వాళ్ళాయన్ని ఉతికి ఆరేసింది. ఇలా అసంత్రుప్తితో ఉన్న జనం అంతా తరువాతరోజు దేవుడు వెళ్ళేచోటుకి ముందుగానే చేరుకుంటున...

ఆకాశంలో నా ఊహలు

ఆకాశంలో నా ఊహలు అబ్బ ఊహల ఊయల ఎంత బాగుంటుందోకదూ?ఒక్క సారి ఊహల ఊయల ఊగేద్దామమరి? కంది పప్పు కిలో రెండు రూపాయలు.బియ్యం కూడా కిలో రెండు రూపాయాలకే దొరుకుతున్నాయట. కూరగాయలైతే కిలొ అర్ద రూపాయి దాటి లేదు.బంగారం తులం మీద వంద రూపాయలకే వస్తుందట. ఇళ్ళ స్తలాలు కూడా గజం వంద రూపాయలేకేనట.అపార్ట్మెంట్ల బాగోతం పోయి అంతా ఇందిపెండెంత్ ఇళ్ళు కట్టుకుని పెరటిలో కూరలూ,వీధి వైపు స్తలంలో పూల మొక్కలు కనువిందు చేస్తూ ఆహ్లాదంగా వున్నాయి.రైతులకి పంటలన్నీ విపరీతంగా పండి ఎంతో ఆనందంగా ఉన్నారు.ప్రతినిత్యం సంక్రాంతి లానే ఉంది. ప్రతి మనిషీ మోసం మాయ ఏదీ లేక,ఏ గొడవలూ లేకుండా ఎంతో సక్యతగా సంతోషంగా ఉన్నారు. ఇక తిరుపతిలో క్యూ అనేది లేదట.వెళ్ళినవాళ్ళు వెళ్ళినట్లుగానే దర్శనం చేసుకొని బయటకు వఛేయటమే. లడ్డూలు అడిగినవారికి అడిగినన్ని ఇచ్చేస్తున్నారు.భక్తులు ఆనందంతో తన్మయత్వం చెందుతున్నారు. ఆహా ఏమి ప్రజల అద్రుష్టం.రాజకీయనాయకులు కూడా మామూలుగా మాదిరి ఇళ్ళలో ఉండి వారికి ఉన్న ఆస్తులన్నీ బీదవారికి పంచి ఇచ్చి ప్రజల మనసులో దైవాల మాదిరి కొలొపించుకుంటున్నారు.అవును ఇదంతా నా ఊహా చిత్రమే!

మా కళ్ళింకా పేలిపోలేదేం?

మా కళ్ళింకా పేలిపోలేదేం? గుడ్లగూబకీ పావురాయికీ ఒకసారి తగాదా వచిందట.నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నాయట. మీరెంత మంది అంటే మీరెంత మందీ అనుకున్నాయట.తేల్చుకుందాం రా అనుకొని కొండ దిగువున వున్న మైదా నంలో అడవి అంచున వారం తరువాత కలుద్దామని అపాయింట్మెంట్ పెట్టుకున్నాయట. ఆ రోజు రానే వఛింది.గుడ్లగూబలు తండోపతండాలుగా వఛి చెట్లపై వాలాయి.తగాదా పెట్టుకున్న పావురాయి మౌనంగా చూస్తూ కూర్చుంది.లెక్క పెట్టుకుంటావా,ఓటమి ఒప్పుకుంటావా అని అడిగిందిప్రత్యర్ది గుడ్లగూబ దాన్ని. ఒక్క నిముషం ఆగు అంది పావురాయి. నిజంగా ఒక్క నిముషం గడిచిందో లేదో ఆకాశం బూడిద రంగులోకి మారిపోయింది.తూర్పునుంచి,పడమర నుంచి,ఉత్తరం నుంచి,దక్షినం నుంచి వందల కొద్దీ పావురాలు.రెక్కలు టప టపా కొట్టుకుంటూ ఎగిరొఛాయి.వఛి కొండ పైనుంచి క్రింది దాకా,మైదాన మంతా నిండిపోయి నిలిచున్నాయి.ఇంకా వస్తూనే ఉన్నట్లు శబ్దం వస్తూనే ఉంది. గుడ్ల గూబలు అలా చూస్తూనే ఉండి పోయాయి. అదిగో అప్పటినుండే వాటి కనుగుడ్లు అలా పెద్దవైపోయాయి. ............ నమ్మ శక్యంగా లేదు కదూ! నిజమే పావురాల చేతిలో చిన్న ఓటమికే అవి శశ్వితంగా అంత పెద్ద కనుగుడ్లు వేసుకుని ...

జోడీ నంబర్ 'X'

జోడీ నంబర్ 'X' ఇవ్వాళ పొద్దున ఆ ప్రశ్న చూసినప్పటినుండి అతనికి మహా ఆనందంగా ఉంది.అలాంటి ప్రశ్నలు తన గురించి కూడా ఎవరైనా అడక్కూడదూ! ఎన్నాళ్ళనుండో కాచుకొని కూర్చున్నాడు అడిగితే చెబుదామని. తనకీ తన మొహానికీ మ్యాచ్ కావడంలేదని అతను ఏ నాడో డిసైడైపోయాడు.కానీ మా ఇద్దరికీ జోడీ కుదిరిందా అని ఇన్నెళ్ళలో ఒక్కళ్ళుకూడా అడగలేదు.అడిగితే దానిమీద ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే కుదరదనే సమాదానం ఎక్కువమంది నుంచి వస్తే దాన్ని మార్చటానికి ఎవరో ఒకరు ఈపాటికే ముందుకు వచ్చే వారే! తనకీ తన మార్కులకీ కూడా ఏ ఏడాదీ మ్యాచ్ అవలేదు.ఆ ప్రశ్న ఎవరైనా అడిగి ఉంటే జనం తన ఆన్సర్ షీట్లు దిద్దిన టీచర్లకు గడ్డి పెట్టి ఉంటే వాళ్ళకా అధికారం తొలగించి ఉంటే,ఈ పాటికి తన ప్రతిభకు రావాల్సిన గుర్తింపు అంతా వచ్చేసి ఏ స్మిత్ సోనియన్ ఇన్స్టిటూట్ లోనో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అంతెందుకు తనకీ తన కాలనీ రోడ్డుకీ ఏ మాత్రమైనా మ్యచింగ్ ఉందా!రోడ్డుమీద వేగంగా నడిచే అవకాశం లేక కదూ జీవితంలోనూ వేగంగా నడవడం చేతకాకుండా పోయింది.దీనిమీద ఒపేనియన్ పోలింగ్ జరిపితే ఎంతమంది తనను సమర్దించి ప్రబుత్వం నుంచి భారీ నష్టపరిహారం ఇప్పించి ఉండే వాళ్ళో! తనకీ తన అమ్మా,న...

ఎంత మంచి నమ్మకమో!

ఎంత మంచి నమ్మకమో ! దారి పొడగునా ఎర్ర గుడ్డలు చుట్టిన కొబ్బరి కాయలు. బస్సు అడుగడుగునా ఆగి వాటిని లోపల వేసుకొని వెళుతోంది. ఒక్కొక్కసారి ఆ కొబ్బరి కాయలు పట్టుకొని మనుషులెవరూ నిలబడి కూడా ఉండరు.అయినా బస్సులు ఆగి ఎన్ని కాయలుంటే అన్నిటినీ ద్రైవరు సీటు ప్రక్కన సర్దుకొని తీసుకువెళుతున్నాయి. ఎక్కడికి వెల్తున్నయి ఆ కాయలన్నీ? ఒరిస్సా లోని ఒక గుడికి.తరనీమాత ఆలయానికి.ఆ గుల్లో రోజూ 20-30 వేల కొబ్బరికాయలు కొడతారట.పండగలప్పుడు లక్ష కూడా కొడతారట.ఒకల్లా తరువాత ఒకరు వేసుకొని పూజారులు ఈ కొబ్బరి కాయల్ని కొడతారట. ఎవరు పంపుతరు ఈ కాయలన్నీ? భక్తులు.మొక్కునుబట్టి కాయలు.ఒక్కక్కసారి వాటితోపాటే ముడుపులుకూడా ఉంటాయట.అయినాకూడా బస్సు డైవర్లు వాటిని జాగ్రత్తగా తీసుకెళ్ళి అమ్మవారికి అప్పజెప్పేస్తారు.బస్సు అమ్మవారి ఆలయం ఉన్న ఘట్ గావ్ దాకా వెల్లకపోతే ఆ దారిలో వెల్లే కూడలి దగ్గర దింపి వెల్లిపోతారట.అటెల్లే బస్సు వాళ్ళు వాటిని ఎక్కించుకొని తీసుకువెల్తారట. ఎక్కడా మోసం లేదు.దగా లేదు.కొబ్బరకాయ అమ్మవారిని చేరకపోయె ప్రస్నె లేదు.బద్దకించో,నిర్లక్ష్యం చేసో తీసుకెల్లకపోతే ఇంగిన్ చెడిపోవడమ...