Showing posts with label health. Show all posts
Showing posts with label health. Show all posts

Saturday, 4 May 2024

ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగుతున్నారా? జాగ్రత్త!

ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్‌ లోనుంచి బాటిల్‌ తీసుకుని చల్లని నీళ్లు గటగటా తాగడం  చాలా మందికి అలవాటే. విపరీతమైన వేడిలో మన శరీరానికి రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీరు కొంత ఉపశమనం కలిగించేమాట నిజమే అయినా ఇలా చేయడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగడం వల్ల గొంతు నొప్పి, టాన్సిలైటిస్‌ సమస్య మాత్రమే కాదు.. జీర్ణక్రియ నుంచి రోగనిరోధక వ్యవస్థ వరకు... చివరకు గుండెపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.

      ఎందుకంటే రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీటిని తాగడం వల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి. అదేవిధంగా ఆహారం తిన్న తర్వాత చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఘన ఆహారం సరిగా జీర్ణం కాదు. ఫలితంగా మలబద్ధకం వస్తుంది.

అంతేకాదు, చల్లటి నీటిని తాగడం వల్ల ఈ నాడి చల్లబడుతుంది. ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా తగ్గితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

      రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా శరీరంలో వివిధ రకాల సమస్యలు సంభవిస్తాయి. చల్లటి నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు గట్టిపడుతుంది. ఇది బరువు పెరిగేందుకు దారితీస్తుంది.

అందువల్ల వీలయినంత వరకు ఎండలో నుంచి రాగానే చల్లటి నీళ్లు తాగకూడదు. అందులోనూ ఫ్రిజ్‌లోని నీళ్లు తాగడం అసలు మంచిది కాదు. కొంచెంసేపు ఆగిన తర్వాత కుండలోని నీళ్లు లేదా నార్మల్‌ వాటర్‌ ముందు తాగి, ఆ తర్వాత చల్లటి నీళ్లు తాగినా ఫరవాలేదు.

Popular Posts