Monday 31 December 2018

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

ప్రస్తుతం ఉన్న జెనరేషన్ లో చాలా మంది టీవీలు చూడడం కంటే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఖాతాలను ఎక్కువగా వాడుతున్నారు. అందుకే ఇప్పుడు వాటికి క్రేజ్ బాగా పెరిగింది. క్రిష్ రూపొందిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ వారు నిర్మాతలకు భారీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

అప్పటివరకు సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్ లేనప్పటికీ సినిమా ట్రైలర్ వచ్చి అంచనాలను అమాంతం పెంచేసింది. ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. దర్శకుడిగా క్రిష్ ఈ సినిమాకి నూటికి నూరు శాతం న్యాయం చేసి ఉంటారని అందరూ నమ్ముతున్నారు.

తన తండ్రి గెటప్ లో బాలకృష్ణ కూడా ఇమిడిపోయాడని అంటున్నారు. అందుకే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమాకి భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు కలిపి పాతిక కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఆ రేటుకి బాలకృష్ణ సినిమా డిజిటల్ రైట్స్ ని అమ్మేసినట్లు తెలుస్తోంది.

అమెజాన్ పైమ్ ఆఫర్ :- ఈరోజే ఉచితంగా సబ్‌స్కైబ్ అవ్వండి.. ఒక నెల రోజులు పాటు అన్ని సినిమాలూ చూసేయండి ఉచితంగా.

రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Sponsored: Amazon Prime India

Saturday 29 December 2018

రాజమౌళి తనయుడు పెళ్ళిలో తారక్ రచ్చ

రాజమౌళి తన కొడుకు కార్తికేయ పెళ్లిని జైపూర్ లో జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకి సినీసెలబ్రెటీలు అందరు హాజరయ్యారు. వారిలో  ప్రభాస్, అనుష్క, రామ్ చరణ్, ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక నిన్న రాత్రి జరిగిన పార్టీలో తారక్ స్టేజ్ పై చేసిన రచ్చ మాములుగా లేదు.

దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో సందడి చేస్తుంది. మొదట కీరవాణి స్టేజ్ పై ఉన్న ప్రభాస్ ని ఓ ప్రశ్న అడగడానికి ప్రయత్నిస్తుంటాడు. డార్లింగ్ అని పిలుస్తూ....ఆడవారి వయసు చెప్పకూడదు, మగవాడి సంపాదన అడగకూడదు. అందుకే బాహుబలి సినిమాకు నువ్వు ఎంత పారితోషికం తీసుకున్నావని నేను అడగను అని అనే లోపు తారక్ స్టేజ్ పై మీదకు వచ్చేశాడు.

కీరవాణిని ఏడిపిస్తూ కొన్ని కామెంట్స్ చేస్తుండగా.... దానికి కీరవాణి తారక్ నీది ఎలిఫెంట్ కామెడీ అని అంటుంటే... మాకు తెలుసు అంటూ అక్కడున్న వారిని చూస్తూ ధన్యవాదాలు చెబుతుంటాడు. కీరవాణి తారక్ తారక్ అని ఎంతగా పిలిచినా పట్టించుకోకుండా కామెడీ చేస్తూనే ఉన్నాడు. ఆ వీడియో తారక్ అభిమానులుఆకట్టుకుంటుంది .Video Link

Friday 28 December 2018

వినాయక్ వైజాగ్ థియేటర్ కూల్చివేత

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఈమధ్యన వైజాగ్ లో విమాక్స్ పేరుతో ఓ థియేటర్ కంప్లెక్స్ నిర్మించారు. ఆ కాంప్లెక్స్ వైజాగ్ లో జగదాంబ థియేటర్ల తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకుంది. అందుకు కారణం వినాయక్ క్రేజ్ .... ఆ థియేటర్స్ లో ఉన్న ఫెయిసిలిటీ. వినాయక్ దర్శకుడుగా వెలుగుతున్న రోజుల్లో రెండు పాత థియేటర్లను కొని అధునాతన వసతులను ఏర్పాటు చేసి విమాక్స్ పేరుతో డెవలప్ చేశాడు.

అతి తక్కువ సమయంలో ఆ థియేటర్లు సిటీలో సెంటరాఫ్ అట్రాక్షన్ కదా, లోకల్ జనాలకు మేజర్ స్పాట్ గా మారాయి. అయితే ఇప్పుడు ఆయా థియేటర్లు కూల్చేస్తున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీకి ఆ థియేటర్ కాంప్లెక్స్ ను అమ్మేశాడట వినాయక్. ఆ సంస్థ అక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. అంటే ఆ థియేట‌ర్స్  త్వ‌ర‌లోనే కూల్చేస్తారని తెలుస్తోంది‌.

ఇక  వి.వి.వినాయ‌క్‌ ఈ కాంప్లెక్స్ అమ్మేయటాని కారణం ...మంచి రేట్ ప‌ల‌క‌డమే అని తెలుస్తోంది. అంతేతప్ప చాలా మంది భావిస్తున్నట్లు ఆర్దిక సమస్యలు ఏమీ లేవని, ఆయన వెల్ ఆఫ్ గా ఉన్నారని సమాచారం. ఇక వరస ఫ్లాఫ్ లతో ఉన్న వినాయిక్ ..సాయి ధరమ్ తేజ తో చేసిన మిస్టర్ ఇంటిలిజెంట్ సినిమా తర్వాత మరొక సినిమా కమిటవ్వలేదు. మంచి కథతో మళ్లీ స్టార్ హీరోతో ఆయన హిట్ కొట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు

Thursday 27 December 2018

13 ఏళ్లలో తొలిసారి బికినిలో దర్శనమిచ్చింది

సినిమా రంగంలో ఏ టైములో చేయాల్సిన గ్లామర్ షో అప్పుడే చేయాలి. ఈ సత్యాన్ని హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఆలస్యంగా తెలుసుకుంది. జూనియర్ ఐశ్వర్యారాయ్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు చేసి విజయాలను అందుకుంది. కానీ, ఎందుకో ఎక్కువకాలంనిలదొక్కుకోలేదు . ఆమధ్య బాలాకిష్ణ సింహ సినిమాలో కనిపించి మెప్పించింది.

ఇప్పుడు హాట్ షోకి తెరలు తీసింది. మొదటి బికినీ ఫోటో అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది స్నేహ ఉల్లాల్. ఫిట్నెస్ పరంగా బాగున్నా....ఇప్పటికే ఆలస్యం అయిపొయింది కాబట్టి, మిగిలినవారికి ఉన్న ఫాలోయిన్ తనకు లేదు. అయితేనేమి స్నేహ ఉల్లాల్ ఇప్పటి నుంచి ఇది కొనసాగిస్తున్నానని చెబుతుంది.  స్నేహ ఎంట్రీ ఇచ్చింది 2005లో. ఇప్పటికి 13 ఏళ్ళు గడిచింది.

సల్మాన్ ఖాన్ లక్కీతో పరిచయమైన స్నేహకు జూనియర్ ఐశ్వర్య రాయ్ అనే పేరు వచ్చింది కానీ ఆ రేంజ్ లో అవకాశాలు మాత్రం రాలేదు. ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేకుండా ఖాళీగా ఉన్న స్నేహ ఉల్లాల్ వాటికి గేలం వేయడం కోసం ఇలా మొదలుపెట్టింది. ఎక్కాల్సిన ట్రైన్ జీవిత కాలం లేట్ తరహాలో కెరీర్ మొదలుపెట్టిన 13 ఏళ్లకు ఫస్ట్ బికినీ వేస్తే వర్క్ అవుట్ అవుతుందంటారా.

Wednesday 26 December 2018

సుడిగాలి సుధీర్ ని పెళ్లి చేసుకోవడంపై స్పందించిన రష్మీ

జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్.. ప్రదీప్ ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని వస్తే ఎవరిని  చేసుకుంటారనే ప్రశ్న యాంకర్ రష్మీ గౌతమ్‌కు ఎదురైంది. ఇందుకు ఆమె ఏం చెప్పిందంటే.. తన వర్క్ వేరు, వ్యక్తిగతం వేరని చెప్పింది. రెండూ వేరు వేరుగా వుంటాయి. ఇందులో వుండే వ్యక్తులు అందులోకి రారు. అందులో వుండే వ్యక్తులు ఇందులోకి రారని స్పష్టం చేసింది. అలాగే మీ పెళ్లి లవ్వా, అరేంజ్డ్ మ్యారేజా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు......

సహజీవనం అనే ఆప్షన్ వుందిగా అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. కాగా బుల్లితెర యాంకర్‌గా మంచి క్రేజ్ కొట్టేసిన రష్మీ.. సినిమాల్లో కనిపిస్తూ... కుర్రకారు హృదయాలను దోచేస్తోంది. తాజాగా ట్విట్టర్ లైవ్ ఛాట్‌లో ప్రదీప్‌తో పెళ్లి గురించి స్పందించింది. తనకు పెళ్లి గురించి అడిగే ప్రశ్నలు నచ్చవని రష్మీ చెప్పుకొచ్చింది. పెళ్లికి ముందే తాను ఓ బిడ్డను దత్తత తీసుకుంటానని రష్మీ చెప్పుకొచ్చింది

Tuesday 25 December 2018

అందరు ఎన్టీఆర్ నే టార్గెట్ చేశారు

బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో  కాఫీ విత్ కరణ్ జోహార్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో కి తాజాగా బాహుబలి టీమ్ రాజమౌళి, రానా, ప్రభాస్ గెస్ట్ లుగా వెళ్లారు. అందులో భాగంగా హోస్ట్ కారం జోహార్ రాజమౌళిని ఈ షోకి రానా, ప్రభాస్ ల తో కాకుండా వేరే ఎవరితో రావాలని ఉంది అని అడగ్గా తారక్, రవితేజ అని సమాధానం చెప్పాడు.

ప్రభాస్ ని వీరిలో బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు? అని ఆప్షన్ ఇవ్వగా తారక్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ అని ఈ వరుస క్రమంలో చెప్పుకొచ్చారు. రానాని లాంగ్ డ్రైవ్ కి ఎవరితో వెళ్ళడానికి ఇష్టపడుతావ్ అని అడిగితె.... ఎన్టీఆర్ అని బదులు ఇచ్చారు. దాంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఖుషి అవుతున్నారు. సరదాగా సాగిన ఈ షోలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

Saturday 15 December 2018

అక్కడ తెలుగుదేశం ఓటమి, ఇక్కడ 2019లో వైకాపా ఓటమికి దారితీయనుందా?

అక్కడ తెలుగుదేశం ఓటమి, ఇక్కడ 2019లో వైకాపా ఓటమికి దారితీయనుందా?

నిత్యం ఐవిఆరెఎస్ కాల్స్, పాలన బావుందా? మీ అభిప్రాయాలు కావాలని. లోకల్ గా ఎన్ని ఇబ్బందులు వున్నా, చంద్రబాబు నాయుడి గొంతుతో అడిగేసరికి, అయ్యో కష్టపడే ఆయన కదా అని, అంతా బావుందని 1 నొక్కేస్తున్నారు.

ఆయన ఏమో, దానిని ముందేసుకొని, ఇంటెలిజెన్స్, పార్టీ వర్గాల సమాచారం మరియు బయటి వ్యక్తుల సర్వేలు, పార్టీ వర్గాలతో సమీక్షలు చేస్తుంటారు.

ఎన్ని గెలుస్తామో చెబుతూ, మీరు పని చేయట్లేదు, అవసరం అయితే మారుస్తా అని చెబుతూ వుంటారు.

నిత్యం ఎమ్మెల్యేలను ఏదో ఒక కార్యక్రమం పెట్టి, స్థానికంగా తిరిగేలా చేస్తున్నారు.

కానీ ఎంతటి క్రీడాకారుడు అయినా, నిత్యం కొంత ప్రాక్టీస్ చేస్తుంటాడు.

అలా తెలంగాణాలో కాంగ్రెస్స్ తో వెళ్లి, కుళ్లబొడిపించుకొని వచ్చింది. ఇంకా ఇక్కడ ఆరు నెలలు వుంది. ఆ దెబ్బలకు కారణాలు, అక్కడి వ్యూహాలు అన్నీ ఒక అనుభవం అవుతుంది.

ముఖ్యంగా, ఇక్కడ ఎలా ఒళ్లు దగ్గర పెట్టుకొని జాగ్రత్త పడాలో, బాగా గుణపాఠం నేర్చుకొంది.

నిన్నటి నైరాశ్యంలో నుండి అంతర్మధనం మొదలయ్యి, లోతైన విశ్లేషణ దిశగా, లోతు పాతుల అంతర్ముఖ పయనం జరుగుతోంది. పార్టీలో ప్రతి వ్యక్తి ఏమి చెబుతున్నాడో వింటోంది. ఇవన్నీ క్రోడీకరించి ఆలోచనలు కొలిక్కి వచ్చి, తన వ్యూహాత్మక అడుగులు, దాని నుండి ఆశించవచ్చు.

తెలంగాణాలో ఏదో బాబుగారి పాలన మీద తీర్పు ఇచ్చినట్టు, బాబు గారు అక్కడ సిఎం అవుతానంటే, తెలంగాణా అంతటా తిరస్కరించినట్టు, వైకాపా సంబరపడుతోంది, ఊదరగొడుతోంది.

12 స్థానాల్లో 2 స్థానాల్లో దళితులను గెలిపించుకొని, అక్కడి నుండి కాంగ్రెస్ తో ప్రత్యేక హోదా మీద ప్రకటన చేయించడం మరిచిపోతోంది.

నిజమే, పవన్, జెడి, బిజెపి, జగన్, లెఫ్ట్ మరియు కేసీఆర్ అంతా అంటీ ముట్టనట్టు, విడివిడిగా, మూకుమ్మడి దాడితో, కులం & మతం తో పాటు, అవినీతి ధనంతో, పెద్ద ఎత్తున వస్తారనే విషయం, ప్రతి నాయకుడి నుండి కార్యకర్త వరకు చెప్పి, తెలుగుదేశం తగువిధంగా సిద్ధం చేస్తుంది.

ఎవడు చెప్పినా తనో పెద్ద తోపని, పెడచెవిన పెట్టే జగన్ సహజ గుణం, నంద్యాల & కాకినాడల ఓటమి తరువాత ఏమీ నేర్చుకొన్నట్టు, కనిపించడం లేదు.

అదే జరిగి వుంటే కోడికత్తిని ఒక జాతీయ స్థాయి సమస్యగా ఇంకా చిత్రీకరించడానికి నానా పాట్లు పడుతూ, తుఫాన్ లాంటి విషయాల మీద నిర్లక్ష్యం వహించేది కాదు.

నాలుగు రోజులు ముందు, కేంద్ర కరువు బృందం, రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు తో సమీక్ష చేస్తుంటే, కనీసం తన వైకాపా బృందంతో, ప్రతిపక్ష పార్టీగా వినతి పత్రం ఇవ్వాలని విషయం కూడా మరిచిపోయి, కరపత్రం ద్వారా కరువని కన్నీరు కార్చి, సీఎం ఎంతడిగాడో వార్త వేశారు.

ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో.

అక్కడ తెలుగుదేశం ఇంకొన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచివుంటే మళ్లీ కేసీఆర్ కొనుగోళ్లతో మరింత కుమిలేది. దానితో పాటు ఒరిగేది ఏమీ లేకున్నా, ఇక్కడ కన్నూమిన్నూ గానకుండా వచ్చే ఎన్నికలకు వెళ్లేవారు.

ఇప్పుడు భూమి మీద నిలబడేలా ఆలోచనలు & ఉపాయాలు చేసి వెళుతుంది.

దానికి దేశంలో 4 దశాబ్దాలకు పైగా, అత్యంత అనుభవం వున్న నాయకుడు వున్నాడు.

..చాకిరేవు.(సౌజన్యం తో )

సోనాక్షి సిన్హాకు షాక్ ఇచ్చిన అమెజాన్

ఇటీవల కాలంలో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే భయపడుతున్నారు. అలాగే ఈ కామర్స్ సైట్స్ గతంలో ఒక వస్తువును ఆర్డర్ ఇస్తే దానికి బదులుగా వేరే వస్తువు పంపిన ఘటనలు ఎదురయ్యాయి. ఇన్నాళ్ళు సామాన్య ప్రజలకు మాత్రమే ఇటువంటి సంఘటనలు ఎదురయ్యాయి.
Sonakshi Sinha receives iron piece instead of headphones, Twitterati lauds Amazon’s impartiality

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు ప్రముఖ షాపింగ్ సైట్ అమెజాన్ షాక్ ఇచ్చింది. హెడ్ ఫోన్స్ బదులుగా ఇనుప బోల్డ్ లు పంపింది. దాంతో సోనాక్షి ముంబై అమెజాన్ ప్రతినిధి తో మాట్లాడేందుకు ప్రయత్నించగా... వారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మీడియాని ఆశ్రయించి బండారాన్ని బట్టబయలు చేసింది. ఈ మేరకు అమెజాన్ ను తప్పుబడుతూ సోనాక్షి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

హెడ్ ఫోన్స్ కోసం అమెజాన్ లో 18 వేలు చెల్లిస్తే అందులో ఇనుప బోల్ట్ ఉందని చెప్పింది. ప్యాకింగ్ అంతా బాగానే ఉన్నప్పటికీ హెడ్ ఫోన్స్ కు బదులుగా ఇనుప బోల్ట్ పంపారని సోనాక్షి ఫైర్ అయ్యింది ఈ ట్విట్ కు అమెజాన్ కంపెనీని ట్యాగ్ చేసింది. దాంతో అమెజాన్ స్పందించి. ఈ ఘటనకు విచారిస్తున్నామని చెబుతూ.... తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

Thursday 13 December 2018

దిశాపటాని అందాల విందు

లోఫర్ బ్యూటీ దిశా పాటని బాలీవుడ్ లో వెలుగులు విరజిమ్ముతుంది.పరిశ్రమలో బెస్ట్ మోడల్ గా క్రేజీ ప్రకటనల్లో నటిస్తూనే, పెద్ద తెరపై ఒక్కో అవకాశాన్ని అందుకుంటుంది. ఇటీవలే ప్రియుడు బాఘీ వ సంచలన విజయం సాధించింది.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో భరత్ అనే సినిమాలో నటిస్తుంది.

ఈమె సినీ కెరీర్ ఒకెత్తుఅనుకుంటే , దిశా ప్రస్తుతం  బ్రాండ్ ప్రమోషన్స్ లోను బిజీ గా ఉన్నది. ప్రఖ్యాత కెల్విన్ క్లెయిన్ లోదుస్తుల‌తో పాటు, ర‌క‌ర‌కాల బ్రాండ్ల‌కు ప్ర‌చారం చేస్తున్న ఈ భామ నాలుగుచేతులా ఆర్జిస్తోంది. ఆ క్ర‌మంలోనే వేడెక్కించే ఫోటోషూట్ల‌తో నిరంత‌రం సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటోంది.

తాజాగా దిశా రివీల్ చేసిన ఈ కొత్త ఫోటో వైరల్ అవుతుంది. మత్తెక్కించే బిగి అందాల్ని, నాభి అందాల్ని ప్రదర్శిస్తూ ట్రెడిషనల్ డ్రెస్ లోను వేడి పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇంతందంగా తీరైన రూపాన్ని మెయింటెయిన్ చేయ‌డం కోసం దిశా ప‌డే శ్ర‌మ అంతా ఇంతా కాదు. నిరంత‌రం ఫిటెనెస్ సెంట‌ర్ల‌లో క‌స‌ర‌త్తులు చేస్తూ ఈ లెవ‌ల్‌ని అందుకుంది.

Monday 10 December 2018

మెగా బ్రదర్ పై బాలయ్య ఫాన్స్ ఫైర్

మెగా బ్రదర్, నిర్మాత నాగబాబు ఓ ఇంటర్వ్యూ లో బాలయ్యపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.  బాలయ్య ఎవరో తెలియదంటూ నాగబాబు చేసిన కామెంట్స్ పై ఫాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో నాగబాబుపై ఫన్నీ సెటైర్స్ వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. నాగబాబు కావాలనే రేచ్ఛతోట్టె విధంగా బాలయ్య పై వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు.

ఇంతకీ ఆ ఇంటర్వ్యూ లో నాగబాబు ఏమన్నారంటే.... బాలయ్య ఎవరో నాకు తెలియదు, ఐ యామ్ వెరీ సారీ.... ఏయ్... బాలయ్య గురించి తెలియదు అన్నానేంటి? బాలయ్య గారు చాలా పెద్ద ఆర్టిస్టు. సీనియర్ మోస్ట్....నేరము శిక్షలో కృష్ణ గారు, ఆయన కలసి నటించారు అని సీనియర్ నటుడు బాలయ్య గురించి చెప్పాడు. సీనియర్ నటుడు బాలయ్య కాదు నందమూరి బాలకృష్ణ అని యాంకర్ అడగ్గానే నేనెప్పుడూ బాలకృష్ణ పేరు వినలేదని మండిపడ్డాడు.

ప్రజాకూటమిలోకి మజ్లిస్! అసదుద్దీన్ స్పందన...

తెలంగాణలోఎన్నికల ఫలితాలు వెలువడనున్న వేళ రాజకీయాల్లో అనూహ్యా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇందులో భాగంగా ‘మా సొంతబలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అన్న తెరాస ప్రకటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ… దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూస్తామనితెలిపారు.  శనివారం  భాజపా నేత లక్ష్మణ్‌మాట్లాడుతూ మజ్లిస్‌, కాంగ్రెసేతరపార్టీతో తాము కలుస్తామని పరోక్షంగా తెరాసకు సానుకూల సంకేతాలు పంపిన విషయంతెలిసిందే.

ప్రజాకూటమిలోకి రావాలన్న కాంగ్రెస్‌ ఆహ్వానంపై ఆలోచించి నిర్ణయంతీసుకుంటామన్నారు. తెలంగాణలో గెలుపై రాజకీయ పార్టీలు ఆధారాలు లేకుండా అంచనావేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో  ఎంఐఎం  కనీసం 7 స్థానాలు గెలవనున్నట్లు  వస్తున్న సర్వేలపై రాజకీయ పార్టీల చూపు ఎంఐఎం పై ఉండటంతో ఫలితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

Saturday 8 December 2018

కూటమిదే విజయం, ప్రగతి భవన్ వీడేందుకు ముహూర్తం చూసుకోండి

తెలంగాణలో ప్రజాకూటమి విజయంపై పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్‌ ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో ప్రజాకూటమి 65 నుంచి 80 స్థానాలతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

శనివారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన జాతీయ మీడియా దక్షిణ భారతదేశ నాడిని సరిగ్గా పట్టుకోలేకపోయిందని విమర్శించారు. తెలంగాణలో తామే అధికారంలోకి వస్తున్నట్లు జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రగతిభవన్ వదిలేసేందుకు ముహూర్తం చూసుకోవాలని సూచించారు.

తమ నేతలు రేవంత్ ఇంటిపై, మధుయాష్కీ, వంశీ చంద్‌రెడ్డిపై అసహనంతో దాడులు చేశారని కుమార్ ఆరోపించారు. ఈ నెల 11న లెక్కింపు పూర్తయ్యే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

నియంత పాలనను గద్దె దించాలని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారని తమ సర్వేలో వెల్లడైందన్నారు. నిరుద్యోగ భృతి, తాము చేపట్టబోయే సంక్షేమ పథకాలు, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని భావిస్తున్నట్లు కుసుమ కుమార్ తెలిపారు. 

Friday 7 December 2018

ఒక సారిగా కేసీఆర్ కాళ్ళ కింద భూమిని కంపింపచేసిన లగడపాటి

ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణాలో పోలింగ్ పూర్తి అయ్యింది. 72% కు తక్కువ కాకుండా పోలింగ్ నమోదు అయినట్టు సమాచారం. పోలింగ్ పూర్తవ్వగానే వరుసగా జాతీయ మీడియా ఛానళ్ళు తమ సర్వే రిపోర్టులు ప్రకటించడం మొదలు పెట్టాయి. ప్రతి సర్వేలోనూ తెరాసకు మెజారిటీ ఇచ్చి, మహాకూటమికి ఓటమి తప్పదు అని సంకేతాలు ఇచ్చాయి. ఈ క్రమంలో ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మీడియా ముందుకు వచ్చి తెలంగాణ ఎన్నికలు రసకందాయంలో పడేశారు. ఆయన మహాకూటమికి స్పష్టమైన మెజారిటీ ప్రకటించారు.

మహాకూటమిలోని అన్ని పార్టీలను కలిపి 65 (+/-10 సీట్లు) రావొచ్చని చెప్పారు. ఇదే క్రమంలో అధికార తెరాస పార్టీకి 35 (+/-10 సీట్లు) మాత్రమే వస్తాయని చెప్పుకొచ్చారు. అదే విధంగా బీజేపీకి 7 (+/-2 సీట్లు), ఎంఐఎంకి 6-7 సీట్లు, ఇండిపెండెంట్లకు 7 (+/-2 Seats), మరియు బీఎల్ఎఫ్ కు ఒక సీటు రావొచ్చని చెప్పుకొచ్చారు. మహాకూటమిలో టీడీపీకి 5-7 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు ఆయన. దీనితో మహాకూటమి క్యాంపులో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.


అదే సమయంలో తెరాస క్యాంపులో ఒక్క సారిగా అయోమయంకు గురయ్యారు. ఎన్నికలకు ముందు లగడపాటి చెప్పిన సర్వే కావాలని చంద్రబాబుకు అనుకూలంగా మార్చి చెప్పారని వారు అనుకుని సరిపెట్టుకున్నా, ఇప్పుడు ఎన్నికల తరువాత అబద్ధం చెప్పి ఆయన విశ్వసనీయత పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అని అలోచించి ఆందోళనకు గురవుతున్నారు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఒక్క సారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ నెల 11న ఫలితాలు అధికారికంగా విడుదల కాబోతున్నాయి. ఈ సస్పెన్స్ అప్పటిదాకా కొనసాగుతుంది. మరో పక్క తెరాస గెలుపుపైనే ఎక్కువగా పందాలు జరగడంతో ఏం జరగబోతుందో అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో ప్రభావం చూపించబోతున్నాయి. మహాకూటమి గెలిస్తే గనుక దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఉండే అవసరం ఏర్పడుతుంది. అదే విధంగా జాతీయ రాజకీయాలలో చంద్రబాబు ఇమేజ్ అమాంతం పెరుగుతుంది. ఆరు నెలలో ఎన్నికలకు వెళ్లబోయే ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ అనుకూల పవనాలు వీయడం ఖాయం.

వాళ్ళకి ఇక నిద్రలు లేనట్టే!

ఒక పక్క సర్వేలు అన్నీ తెరాసాకె మళ్లీ అధికారం అంటూ చెబుతూ ఉంటే, మరో పక్క ‘ఆంధ్రా ఆక్టపుస్’ లగడపాటి మాత్రం కూటమికే గెలుపు అవకాశం ఎక్కువగా ఉంది అని తేల్చి చెప్పేశారు. దాదాపుగా కూటమి పార్టీలు అన్నీ కలసి 65 కి అటూ ఇటూగా వస్తాయి అని లగడపాటి చెప్పేశారు. అంతే కాదు దాదాపుగా జిల్లాల్లో 80 శాతం కూటమికే ఫేవర్ గా ఉన్నట్లుగా కూడా ఆయన స్పష్టం చేసేసారు. ఇదిలా ఉంటే మరో పక్క ఎలా చూసుకున్న లగడపాటి లెక్క ప్రకారం తెరాసాకు తెలంగాణాన ప్రజలు చరమగీతం పాడనున్నారు అని అర్ధం అవుతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు.

అయితే మరో పక్క అందరిదీ ఒక గోల అయితే, కొందరిది ఇంకో గోల అన్నట్లు…ఏ పార్టీ గెలుస్తుందా అన్న మాట పక్కన పెడితే, నార్త్ ఇండియా సర్వేలు అన్నీ తెరాసాకి ఫేవర్ గా ఎగ్సిట్ పోల్స్ ఇవ్వగానే ఆనందంలో మునిగిపోయిన కొన్ని వర్గాలు, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన కొన్ని సామాజిక వర్గాలు, ఒక బడా హీరో అభిమానులు, ఆయా అభిమానుల వెనుక ఉన్న ఒక కోస్తా సామాజిక వర్గం పాపం లగడపాటి సర్వేని చూడగానే షాక్ కి గురయ్యారు. మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ద పెట్టి మరీ కేసీఆర్ ని గెలిపించాలి అని తెరాసాకు మద్దతుగా నిలిచిన వాళ్ళు కేసీఆర్ అండ్ పార్టీ మళ్లీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని భారీ ఆశలే పెట్టుకుని, భారీగానే బెట్టింగ్స్ కూడా కాసినట్లు తెలుస్తుంది.

అయితే ఈరోజు లగడపాటి చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కూటమికి ఆధిక్యం స్పష్టం అవనున్న తరుణంలో ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటో, అసలు రేపు 11న ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ సరిగ్గా నిద్ర పోతారో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ఇక మరో పక్క లగడపాటి జోస్యం నిజం అయ్యీ, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే త్వరలో అంటే వచ్చే నాలుగు నుంచి అయిదు నెలల్లో జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. అదే జరిగితే మాత్రం ఈసారి సీఎం సీట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న జగన్ మరియు పవన్ ఇద్దరూ ప్రతిపక్షానికి పరిమితం కాక తప్పదు.

Thursday 6 December 2018

నెటిజన్స్ మెచ్చిన ఫోటో ఇదే

ఈ ఏడాది ప్రముఖ సామజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా నెటిజన్స్ ఏ విషయాలను ఎక్కువగా మాట్లాడారు, వేటిని ఎక్కువగా మెచ్చరు అనే జాబితాని ట్విట్టర్ ఇండియా 2018 తాజాగా విడుదల చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అయన సతీమణి బాలీవుడ్ నటి అనుష్క శర్మ కార్వా చౌత్ వేడుకలు చేసుకున్న ఫోటో నెటిజన్స్ అత్యంత ఇష్టమైందిగా నిలిచింది.

అక్టోబర్ నెలలో విరుష్క దంపతులు కార్వాచౌత్ వేడుకలను జరుపుకొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి వెన్నెల వెలుగులో ఉన్న ఫొటోను విరుష్క జంట సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఈ ఏడాది అత్యధిక మంది నెటిజన్లు మెచ్చిన ఫొటోగా ఇది నిలిచింది. ఈ ఫొటోకు దాదాపు 2,15,000 లైక్స్‌ వచ్చాయి. ఈ ఏడాది మొత్తం మీద భారత్‌లో ఎక్కువగా ట్రెండ్‌ అయిన 10 హ్యాష్‌ట్యాగ్‌లలో ఏడు దక్షిణ చిత్రపరిశ్రమకు చెందినవే కావడం గమనార్హం.

Wednesday 5 December 2018

అగ్గి రేపుతున్న ప్రగ్య

అందంతో కవ్వించడం, యూత్ గుండెల్లో తిష్ట వేయడం అందాల ప్రగ్య జైస్వాల్ కి కొత్తేమి కాదు. కంచె సినిమాలో సంప్రదాయబద్ధంగా కనిపించినప్పటికీ ఆ తర్వాత తనలోని గ్లామర్ యాంగిల్ అందరికి పరిచయం చేసింది ఈ అందాల భామ. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన ఆకాశం కోసం చాలా ప్రయత్నిస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సిరా నరసింహరెడ్డి లో అవకాశం అందుకుంది. అలాగే ఈ భామ బాలీవుడ్లో హీరోయిన్ గా నటించే ప్రయత్నాల్లో ఉందని తెలుస్తుంది. ఆ ఆలోచనతోనే ఇటీవల రూటు మార్చిన ఈ అమ్మడు సామాజిక మాధ్యమాల్లో వేడెక్కించే ఫోటో షూట్స్ తో చెలరేగిపోయింది.

మొన్నటి మొన్న తన దేహాన్ని టైట్ గా హత్తుకొనిపోయే జిమ్ డ్రెస్ లో ప్రగ్య దర్శనమిచ్చి షాక్ ఇచ్చింది. ఈ అమ్మడు అగ్గి రాజేసిందంటే అతిశయోక్తి కాదు. తాజాగా మరో వేడెక్కించే ఫొటోతో సెగలు రేపుతోంది. ప్రగ్యను ఇలా చేశాక అయినా మన దర్శకనిర్మాతలు, స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వకుండా ఉంటారా??

దర్శకుడు శంకర్ సంచలన నిర్ణయం

గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమా ఎంత భారీ స్ధాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. తాజా చిత్రం 2.0 దాదాపు 550 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందించారు. రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్‌తో 2.0 దూసుకెళుతోంది. ఈ సినిమా త‌ర్వాత శంక‌ర్ భార‌తీయుడు 2 తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ న‌టించే ఈ సినిమా త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే... శంక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. బారతీయుడు 2 సినిమాలో గ్రాఫిక్స్‌ని నమ్ముకోవట్లేదట‌. గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీయాల‌నుకుంటున్నాడ‌ట‌. భారతీయుడులో లాగే ఇందులో సమాజంలో పేరుకుపోయిన అవినీతి మీద కథ నడుస్తుందట‌. కాకపోతే భారతీయుడు ఈ కాలంలో ఉన్న టెక్నాలజీ ఎలా వాడుకుంటాడు, పోలీసులకు ఇంకెంత సవాల్ విసురుతాడు అన్న అంశాలు అదనంగా ఉండబోతున్నాయంట. మ‌రి.. ఈ సినిమాతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Sunday 2 December 2018

కేసీఆర్ కు అండగా సాక్షి.. లోగుట్టు పెరుమాళ్లకెరుక..!

లగడపాటి సర్వే అంటూ బయటకు రావడంతో ఉన్నఫళంగా తెలంగాణాలోని అధికార పార్టీలో గుబులు మొదలయ్యింది. ఇప్పటికే గెలిచే ఇద్దరి రెబెల్స్ పేర్లు చెప్పడం వారిద్దరూ కాంగ్రెస్ రెబెల్స్ కావడం అధికార పార్టీ నేతలకు కంటగింపుగా మారింది. సహజంగా ఓటర్లలో కొంత మందికి ఏ పార్టీతోను సంబంధం ఉండదు వారు మాత్రం ఎప్పుడూ గెలిచే పార్టీకి ఓటు వెయ్యాలని అనుకుంటారు. మీడియా అనుకూలంగా ఉండటంతో వీరందరూ తెరాస తన ఓటర్లని భావిస్తుంది. అయితే లగడపాటి సర్వే మీద మన వారికి బాగా గురి ఉండటంతో వారి ఓట్లు తరలి పోతాయేమోనని తెరాస భయం.

దీనితో కేసీఆర్ ఇప్పటికే ఈ సర్వే మీద ఒంటి కాలి మీద లేచారు, అదే విధంగా పార్టీ ఎన్నికల కమిషన్ కు కంప్లయింట్ చేసింది. ఈ క్రమంలో తెరాసకు అనుకూలంగా సాక్షి తన వంతు ప్రయత్నం తాను చేసింది. లగడపాటి సర్వే బోగస్ అంటూ ఈరోజు మొదటి పేజీలో బ్యానర్ ఐటెం వేసింది. ర్వే చేస్తే అంచనాలు తెలుస్తాయని, కానీ ఆ అంచనాలే నిజం కావాలని లేదని సన్నాయి నొక్కులు నొక్కింది. సాక్షి అనగానే చంద్రబాబు టచ్ లేకుండా ఉండదు కాబట్టి. ఇదంతా లగడపాటి ద్వారా మహాకూటమి కోసం కేసీఆర్ చేసిన కుట్ర అని చెప్పుకొచ్చింది. తిరుపతి వెళ్లడానికి ముందే తెలంగాణలో ప్రచారానికి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుతో లగడపాటి సమావేశమయ్యారని, ఈ భేటీలో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలతో పాటు ఎల్లో మీడియా తోక పత్రిక అధినేత (ఆంధ్రజ్యోతి ఆర్కే) కూడా పాల్గొన్నారని సాక్షి ప్రచురించింది. ఈ సందర్భంగా కూటమికి, టీఆర్‌ఎస్‌కు మధ్య పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికి, ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్లాన్‌ వేసినట్టు స్పష్టమయిందని సాక్షి తేల్చేసింది.

తెలంగాణాలో పోటీ నుండి తప్పుకున్న వైకాపా ఇప్పటికే తన సంపూర్ణ మద్దతు తెరాసకు ఇచ్చిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వైకాపా మీటింగులు, రెడ్డి కుల మీటింగ్లు పెట్టిస్తుంది ఆ పార్టీ. ఇప్పుడు ఏకంగా కష్టకాలంలో కేసీఆర్ ను ఆదుకోవడానికి సాక్షినే రంగంలోకి దిగింది. గతంలో వైకాపాకు అనుకూలంగా ఉన్న సర్వేలను ఎత్తుతూ మొదటి పేజీలో ప్రచురించేది సాక్షి. వైకాపాకు వ్యతిరేకంగా వచ్చే సర్వేలను పక్కన పెట్టడం, వాటి భరతం పట్టింది అంటే అర్ధం చేసుకోగలిగేదే. కాకపోతే తెరాసకు వ్యతిరేకంగా సర్వే వచ్చిన తట్టుకోలేకపోతుంది ఏంటో సాక్షి. బహుశా మహాకూటమి తెలంగాణాలో గెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తిరుగు లేకుండా పోతుంది అనే భయం కూడా కావొచ్చు.

Blog Archive