తెలంగాణలో ప్రజాకూటమి విజయంపై పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్ ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో ప్రజాకూటమి 65 నుంచి 80 స్థానాలతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
శనివారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన జాతీయ మీడియా దక్షిణ భారతదేశ నాడిని సరిగ్గా పట్టుకోలేకపోయిందని విమర్శించారు. తెలంగాణలో తామే అధికారంలోకి వస్తున్నట్లు జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రగతిభవన్ వదిలేసేందుకు ముహూర్తం చూసుకోవాలని సూచించారు.
తమ నేతలు రేవంత్ ఇంటిపై, మధుయాష్కీ, వంశీ చంద్‌రెడ్డిపై అసహనంతో దాడులు చేశారని కుమార్ ఆరోపించారు. ఈ నెల 11న లెక్కింపు పూర్తయ్యే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
నియంత పాలనను గద్దె దించాలని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారని తమ సర్వేలో వెల్లడైందన్నారు. నిరుద్యోగ భృతి, తాము చేపట్టబోయే సంక్షేమ పథకాలు, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని భావిస్తున్నట్లు కుసుమ కుమార్ తెలిపారు.