లగడపాటి సర్వే అంటూ బయటకు రావడంతో ఉన్నఫళంగా తెలంగాణాలోని అధికార పార్టీలో గుబులు మొదలయ్యింది. ఇప్పటికే గెలిచే ఇద్దరి రెబెల్స్ పేర్లు చెప్పడం వారిద్దరూ కాంగ్రెస్ రెబెల్స్ కావడం అధికార పార్టీ నేతలకు కంటగింపుగా మారింది. సహజంగా ఓటర్లలో కొంత మందికి ఏ పార్టీతోను సంబంధం ఉండదు వారు మాత్రం ఎప్పుడూ గెలిచే పార్టీకి ఓటు వెయ్యాలని అనుకుంటారు. మీడియా అనుకూలంగా ఉండటంతో వీరందరూ తెరాస తన ఓటర్లని భావిస్తుంది. అయితే లగడపాటి సర్వే మీద మన వారికి బాగా గురి ఉండటంతో వారి ఓట్లు తరలి పోతాయేమోనని తెరాస భయం.
దీనితో కేసీఆర్ ఇప్పటికే ఈ సర్వే మీద ఒంటి కాలి మీద లేచారు, అదే విధంగా పార్టీ ఎన్నికల కమిషన్ కు కంప్లయింట్ చేసింది. ఈ క్రమంలో తెరాసకు అనుకూలంగా సాక్షి తన వంతు ప్రయత్నం తాను చేసింది. లగడపాటి సర్వే బోగస్ అంటూ ఈరోజు మొదటి పేజీలో బ్యానర్ ఐటెం వేసింది. ర్వే చేస్తే అంచనాలు తెలుస్తాయని, కానీ ఆ అంచనాలే నిజం కావాలని లేదని సన్నాయి నొక్కులు నొక్కింది. సాక్షి అనగానే చంద్రబాబు టచ్ లేకుండా ఉండదు కాబట్టి. ఇదంతా లగడపాటి ద్వారా మహాకూటమి కోసం కేసీఆర్ చేసిన కుట్ర అని చెప్పుకొచ్చింది. తిరుపతి వెళ్లడానికి ముందే తెలంగాణలో ప్రచారానికి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుతో లగడపాటి సమావేశమయ్యారని, ఈ భేటీలో ఇద్దరు కాంగ్రెస్ నేతలతో పాటు ఎల్లో మీడియా తోక పత్రిక అధినేత (ఆంధ్రజ్యోతి ఆర్కే) కూడా పాల్గొన్నారని సాక్షి ప్రచురించింది. ఈ సందర్భంగా కూటమికి, టీఆర్‌ఎస్‌కు మధ్య పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికి, ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్లాన్ వేసినట్టు స్పష్టమయిందని సాక్షి తేల్చేసింది.
తెలంగాణాలో పోటీ నుండి తప్పుకున్న వైకాపా ఇప్పటికే తన సంపూర్ణ మద్దతు తెరాసకు ఇచ్చిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వైకాపా మీటింగులు, రెడ్డి కుల మీటింగ్లు పెట్టిస్తుంది ఆ పార్టీ. ఇప్పుడు ఏకంగా కష్టకాలంలో కేసీఆర్ ను ఆదుకోవడానికి సాక్షినే రంగంలోకి దిగింది. గతంలో వైకాపాకు అనుకూలంగా ఉన్న సర్వేలను ఎత్తుతూ మొదటి పేజీలో ప్రచురించేది సాక్షి. వైకాపాకు వ్యతిరేకంగా వచ్చే సర్వేలను పక్కన పెట్టడం, వాటి భరతం పట్టింది అంటే అర్ధం చేసుకోగలిగేదే. కాకపోతే తెరాసకు వ్యతిరేకంగా సర్వే వచ్చిన తట్టుకోలేకపోతుంది ఏంటో సాక్షి. బహుశా మహాకూటమి తెలంగాణాలో గెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తిరుగు లేకుండా పోతుంది అనే భయం కూడా కావొచ్చు.