Tuesday, 16 November 2010

విజేత జగన్ !

అవినీతి విజేతలు
1.ఉత్తమ బలహీనమంత్రి
..-> రోశయ్య

2.ఉత్తమ విహారయాత్ర
1...->జగన్(ఓదార్పుయాత్ర).
2..->చిరంజీవి(ప్రజాచైతన్య యాత్ర)
3...->కె.సి.ఆర్.(తెలంగాణా జాగ్రుతి యాత్ర)

3.ఉత్తమ అవినీతి.
1...->యై.యస్.జగన్ (3 1/2 సంవత్సరాలు+45 కోట్లు=3,583 కోట్లు)
2...-> ఎమ్మార్ ఎంజిఎఫ్.
3...->సురేష్ కల్మాడి(కామన్వెల్త్ క్రీడలు2010) .

3.ఉత్తమ చెత్త మీడియా
1...->సాక్షి.
2..->ఎన్ టీ.వీ.
3..->టీ.వీ.5 .

మీకు తెలుసా!

మీకు తెలుసా! ఈప్రపంచంలో అత్యంత పేదవాడెవరో,
మీకు తెలుసా! గత ఏడాది బాగా నష్టపోయిన కంపనీల గురించి,
మీకు తెలుసా! పోనీ గత ఏడాది దివాలా తీసిన 500 ప్రముఖ సంస్థల గురించి,
మీకు తెలుసా! ఎంత బాగా కష్టపడినా విజయం సాధించలేని మనుషుల గురించి,
మీకు తెలుసా! ఎంత అరచి గీపెట్టినా ఫలితం సాధించలేని ఉద్యమాల గురించి,
మీకు తెలుసా! బ్రతకటానికి ఏమాత్రం అనువుగా లేని దేశాలగురించి,
మీకు తెలుసా! చావు తప్ప వేరే దారి చూపించలేకపోతున్న వృత్తుల గురించి,
మీకు తెలుసా! ఏ మాత్రం తెలివి సంపాదించలేకపోతున్న చదువులగురించి?

ఎవేవీ పట్టని ఓ ఇంగ్లీష్ మాగజిన్ ప్రపంచంలోని 'అత్యంత శక్తివంతులైన వ్యక్తుల జాబితా' ను ఇటీవల విడుదల చేసి తనేదో ఘనత సాధించినట్టు గొప్పలు చెప్పుకుంది.
ఇలాంటి జాబితాలను విడుదల చేసి మిగతావాళ్ళను అవమానించడం అవసరమా?
ఈ ప్రపంచంలోని అత్యంత పేదవాళ్ళ జాబితాను కూడా విడుదల చేసి అప్పుడుచాటుకుంటే బాగుంటుంది వారి ఘనత.

పాజిటివ్ వైరాగ్యం!

కోపమొచ్చినప్పుడల్లా అంకెలు లెక్కపెట్టీ పెట్టీ విసుగొచ్చేసింది ఆయనకు.
పళ్ళు నూరాలనిపించినపుడల్లా పళ్ళు కనపడేలా నవ్వీ నవ్వీ అలసిపోయాడాయన.
ఆవేశాన్ని అనచుకోవాల్సొచ్చినపుడల్లా..శ్వాస మీద ధ్యాస పెట్టీ పెట్టీ ఊపిరి పీల్చుకోవడం మీదే విరక్తి వచ్చేసిందిఆయనకు.
వెధవ జీవితం.కోపం మంచిది కాదట.ఏడుపు,ధుఖం మనిషికి ఉండాల్సిన లక్షణాలే కావట.నిరాశను గుండు గుత్తగాఅంగారక గ్రహానికి ఎగుమతి చేయాలట.దేనిమీద విరక్తి కలిగినా విజేతల జీవితాల గురించి చదవాలంట.గడ్డిపోచనుండిధైర్యాన్నీ,గబ్బిలం నుండి తలక్రిందులుగా వేలాడె విద్యను….ఇలా ఏవేవో నేర్చుకోవాలట.పాజిటివ్ ఆలోచనల్నిఎండార్ఫిన్లుగా మార్చుకొని బతకాలట..ఊహు..!తనకోపము తన ఇష్టం అనుకున్నాడాయన.కానీ,తన కోపమే తనశత్రువని మరచిపోలేదాయన.
ఆలోచించగా చించగా ఆయనకు ఒక ఉపాయం తోచింది.
ఓ డ్రామా దుస్తుల కంపనీకి వెళ్ళి సెకండ్ హాండ్ దుస్తులను కొని ఇంటికి పట్టికెళ్ళాడు.
మర్నాటినుంచి చీటికీ మాటికీ తలుపులు బిడాయించుకోవడం మొదలుపెట్టాడు.ముఖ్యంగా పేపర్లుచదివినప్పుడు,వార్తల్ని చూసినపుడు లేచి లోపలికి వెళ్ళిపోయేవాడు.రాజశేఖరరెడ్డి మీద కోపం వచ్చినపుడుచంద్రబాబులా,చంద్రబాబు మేద కోపం వచ్చినపుడు రాజశేఖరరెడ్డిలా,పోలీసు మీద కొపం వఛి నపుడునక్సలైటులా,నక్సలైటుమీద కోపం వఛినపుడు పోలీసులా,టీచరుమీద కోపం వచ్చినపుడు విద్యార్దిలా,విద్యార్ది మీదకోపం వచ్చినపుడు టీచరులా,అమెరికా మీద కోపం వచ్చినపుడు ఇరాక్ లా,పిల్లి మీద కోపం వచ్చినపుడుఎలుకలా,మనిషిమీద కోపం వచ్చినపుడు ప్రక్రుతి లా…ఇలా గంట గంటకూ వేషం మార్చి అద్దం ముందు నిలబడి నోరారాఅవతలి వ్యక్తిని తిట్టి అన్ని బావోద్వేగాలనుండి విముక్తుడవటం నేర్చుకున్నాడు.
ఏడుపు ధుఖం నిరాశ వగైరాలన్నీ కోపం నుండే కదా పుట్టెది.
ఇప్పుడు ఆయన కోపమే ఆయనకు రక్ష.

సత్యమా…సాహసమా!

త్రూత్ ఆర్ డేర్ అని ఇంగ్లీషువాళ్ళు ఆడుకొనే ఆట ఒకటి ఉంది.పిల్లలు,పెద్దలు అందరూ ఆడుతారు దీన్ని.
ఐదుమంది పదిమంది ఎందరైనా ఆడొచ్చు.ప్రతి ఒక్కరికీ చాన్స్ ఉంటుంది.ఎవరి వంతు వస్తే వాళ్ళను సత్యమా సాహసమా అని అడుగుతారు.సత్యమని చెపితే వాళ్ళు జవాబు చెప్పడానికి ఇబ్బందిపడే ప్రశ్న ఏదో అడుగుతారు.నిజమే చెప్పాలి,లేదా నిజంలా ద్వనించే జవాబు చెప్పలి.ఒకవేళ ప్రశ్న వద్దనుకొంటే ఏదో ఒక సాహసం చేసి చూపాలి.మొదటిది త్రూత్,రెండోది డేర్ అన్నమాట.
ఏ ఆటను మనం కాస్త సీరియస్ గా ఆడుకొన్నామనుకోండి.
ఉదాహరనకు నిజం నిప్పులాంటిదని ఎందుకు అంటారు?గాలిలాంటిదనో,వానలాంటిదనో,మెరుపులాంటిదనో,ఉరుములాంటిదనో ఎందుకు అనరు?పోనీ ప్రాస కోసం అంటారనుకొంటే నీళ్ళ లాంటిదనొచ్చుగా.వర్షంలా భూమ్మేద పడినపుడు ఒకలా,నదిలో చేరి ప్రవహించినపుడు ఒకలా,చెరువులో నిలిచిపోయినపుడు ఒకలా,మురికిగుంటలో నిలవున్నపుడు ఒకలా,ఆకులనుంచి బొట్లు బొట్లుగా పడినపుడు ఒకలా కనపడుతుందని దానికి ఎన్ని విశేషనాలు జోడించే అవకాశం ఉంది.!
నిజం నిప్పులా ఉంటుందనటంలో ఇంకో అస్పష్టత ఉంది.
ఇలాంటి ప్రశ్న ఎవరైనా అడిగితే ఏమని జవాబు చెప్పలి?
సత్యం మాట్లాడి చరిత్రకెక్కినవాళ్ళు దేశంలో ఇద్దరే ఇద్దరు ఎందుకున్నారు?
ట్రూత్ వదిలేసి డేర్ కి వెలదామనుకొంటే అవి రెండూ వేరు వేరు అనిపించడంలేదు.మరి ఆ ఆటకు ఆ పేరు ఎందుకు పెట్టారో..?

తెలుగునూ మింగేస్తున్న రాజకీయం

ఆత్మాభిమానం,గౌరవం- ఇవి వేరెవరో వచ్చి రక్షించేవి కాదు,ఎవరికి వారేవాటిని కాపాడుకోవాలని ప్రబోదించారు మహాత్మాగాంధి.వ్యక్తికే కాదు జాతికీ వర్తిస్తుంది స్పూర్తి.
దాదాపు 30 ఏళ్ళ నాడు అప్పటి ప్రధాని కొడుకుగా మన రాష్ట్ర పర్యటనకువచ్చి మన ముఖ్యమంత్రిని అవమానించిన రాజివ్ ఉదంతం తెలుగువాళ్ళింకా మరువలేదు.నాటి ఘటననుమర్చిపోయిన కొందరు నేతలు సోనియాను ప్రసన్నం చేసుకునేందుకు రాజివ్ నామ జపంతో తరించిపోతున్నారు.అమ్మదయ ఊంటే తప్ప రాజకీయంగా మెతుకూ,బ్రతుకూ ఉండదని దిగాలు పడే కొందరు నేతలు ఇప్పటికే రాష్ట్రంలోనిపతకాలన్నింటికీ రాజివ్,ఇందిర పేర్లు తగిలించేశారు.
రెండేళ్ళక్రితం రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముందు తెలుగుకు ప్రాచీన బాషా హోదా కల్పిస్తూ కేంద్రం నిర్నయంప్రకటించినపుడు అదంత తమ గొప్పేనని మన రాష్ట్ర ప్రభుత్వం టాం..టాం..వేసుకుంది.మన రాష్ట్రంలోని ఏకైకఅంతర్జాతీయ విమానాశ్రయానికి మన తెలుగు వారి పేరు పెట్తడానికి నిరాకరించి రాజివ్ భజనతో తరించిన ప్రభుత్వంఆత్మాభిమానం తమకు ఏ కోశానాలేదని ఎప్పుడో చాటుకుంది.
దేశ సేవలో తరించిన తెలుగువారెవరూ లేరన్నట్టుగా పధకాలన్నింటికీ రాజివ్,ఇందిర ల పేర్లు పెట్టడం మన ప్రభుత్వపనితనానికి పరాకాష్ట.
తెలుగుజాతి ఔనత్త్యాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వం వాటన్నింటినీ గాలికొదిలేసి తెలుగు జాతి ప్రతిష్టనుమంటగొల్పింది.తెలుగుగడ్డపై పుట్టిన ఈప్రభుత్వ నేతలకు తెలుగు పనికిరానిదైపోయింది.

హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లోని తెలుగు లలిత కళాతోరణం పేరు ఇప్పుడు రాజివ్ తెలుగు లలిత కలా తోరణంగామారిపోయింది.
తెలుగులలితకళతోరనం పేరు ముందు రాజివ్ పేరు తగిలించి ఈ ప్రభుత్వం తాజాగా తనకు తెలుగుపై వున్న 'చిత్తశుద్ధినిచాటుకుంది.ఇలాంటి ఈ ప్రభుత్వాన్ని క్షమిస్తే తెలుగుతల్లి ఆత్మ క్షోభిస్తుంది.

తెలుగునూ మింగేస్తున్న రాజకీయంఆత్మాభిమానం,గౌరవం- ఇవి వేరెవరో వచ్చి రక్షించేవి కాదు,ఎవరికి వారేవాటిని కాపాడుకోవాలని ప్రబోదించారు మహాత్మాగాంధి.వ్యక్తికే కాదు ఓజాతికీ వర్తిస్తుంది ఆ స్పూర్తి.
దాదాపు 30 ఏళ్ళ నాడు అప్పటి ప్రధాని కొడుకుగా మన రాష్ట్ర పర్యటనకువచ్చి మన ముఖ్యమంత్రిని అవమానించిన రాజివ్ ఉదంతం తెలుగువాళ్ళింకా మరువలేదు.నాటి ఘటననుమర్చిపోయిన కొందరు నేతలు సోనియాను ప్రసన్నం చేసుకునేందుకు రాజివ్ నామ జపంతో తరించిపోతున్నారు.అమ్మదయ ఊంటే తప్ప రాజకీయంగా మెతుకూ,బ్రతుకూ ఉండదని దిగాలు పడే కొందరు నేతలు ఇప్పటికే రాష్ట్రంలోనిపతకాలన్నింటికీ రాజివ్,ఇందిర పేర్లు తగిలించేశారు.
రెండేళ్ళక్రితం రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముందు తెలుగుకు ప్రాచీన బాషా హోదా కల్పిస్తూ కేంద్రం నిర్నయంప్రకటించినపుడు అదంత తమ గొప్పేనని మన రాష్ట్ర ప్రభుత్వం టాం..టాం..వేసుకుంది.మన రాష్ట్రంలోని ఏకైకఅంతర్జాతీయ విమానాశ్రయానికి మన తెలుగు వారి పేరు పెట్తడానికి నిరాకరించి రాజివ్ భజనతో తరించిన ప్రభుత్వంఆత్మాభిమానం తమకు ఏ కోశానాలేదని ఎప్పుడో చాటుకుంది.
దేశ సేవలో తరించిన తెలుగువారెవరూ లేరన్నట్టుగా పధకాలన్నింటికీ రాజివ్,ఇందిర ల పేర్లు పెట్టడం మన ప్రభుత్వపనితనానికి పరాకాష్ట.
తెలుగుజాతి ఔనత్త్యాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వం వాటన్నింటినీ గాలికొదిలేసి తెలుగు జాతి ప్రతిష్టనుమంటగొల్పింది.తెలుగుగడ్డపై పుట్టిన ఈప్రభుత్వ నేతలకు తెలుగు పనికిరానిదైపోయింది.

హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లోని తెలుగు లలిత కళాతోరణం పేరు ఇప్పుడు రాజివ్ తెలుగు లలిత కలా తోరణంగామారిపోయింది.
తెలుగులలితకళతోరనం పేరు ముందు రాజివ్ పేరు తగిలించి ఈ ప్రభుత్వం తాజాగా తనకు తెలుగుపై వున్న 'చిత్తశుద్ధినిచాటుకుంది.ఇలాంటి ఈ ప్రభుత్వాన్ని క్షమిస్తే తెలుగుతల్లి ఆత్మ క్షోభిస్తుంది.

జల జాబిల్లి

చంద్రుడి మీద నీళ్ళున్నాయని తెలియగానే చాలమంది బుర్రల్లో కొత్త ఆలోచనలు తళుక్కుమన్నాయి.
మల్టీనేషనల్ కంపెనీలు ముందుచూపుతో మల్టీప్లానిటరీ కంపనీలుగా పేరు మార్చుకొని అన్నిరకాల ఫాక్టరీల కోసం గనుల కోసం,సెజ్ ల కోసం దరఖాస్తులు పెట్టేసుకొన్నాయి.
ఇన్ ఫ్రాడవలప్ మెంట్ కంపెనీలన్నీ కలసి కన్సార్టియంగా ఏర్పడి రోడ్లు,విమానాశ్రయాలూ,హౌసింగ్ కాలనీలు,ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడానికి టెండర్లు సిద్దం చేసుకోసాగాయి.
శాస్త్రవిగ్నానంలో చంద్రుడిగురించి వున్న సమాచారాన్నంతా క్రోడీకరించి అక్కడికి వెళ్ళడానికి అవసరమైన పరికరాలూ,వస్తువుల్నీ డిజైన్ చేయడంలో మానిఫాక్చరింగ్ ఇండస్ట్రీ యమ బిజీగా ఉంది.
ఆన్ని ప్రపంచ బాషల్లో చంద్రుడిమీద ఉన్న కథలూ,కాకరకాయలూ కలిపి ఓ వెయ్యి పుస్తకాల సెట్ ను ముద్రించే పనిలో పడ్డారు పబ్లిషర్లు.
ఇదంతా చంద్రుదికి ఎలాగో తెలిసింది.ఎలాగో ఏమిటిలే మనం ఇంత దూరమ్నుండి అక్కడి నీటి వాసనను పసిగట్టగాలేనిది అది ఓ వెన్నెల రాత్రి భూమి మీద జరిగే విషయాలను తెలుసుకోలేదా ఏమిటి?వెంటనే నాసాకు ఏవో సంకేతాలు పంపింది.వాటిని డీకొడ్ చేసి చదివితే అర్దమైందేమిటంటే-
ఇంతకాలం ఒక కుందేలు,ఒక అవ్వ మాత్రమె ఉందని నమ్మిన మీరు ఇప్పుడు ఆ అబిప్రాయం ఎందుకు మార్చుకొన్నారు?
మీ ద్రుష్టిలో ఎవర్ని నేను అసలు?సూర్యుడి బార్యనా,చెల్లెల్నా,భూమి కూతుర్నా,అమ్మనా?ఆడదాన్న,మగవాడీనా?మంచిదాన్నా,చెడ్డదాన్నా?తేల్చుకున్నరా ఇప్పుడైనా?నన్ను చూస్తే సముద్రాలు పొంగుతాయని మీరే అంటారు.మనుషుల్లో ఉన్మాదం పెచ్చుమీరుతుందని మేరే అంటారు.ఏది నిజం?
నాలో అమ్రుతం ఉందని ఊహించిందీ మేరే,మట్టి తప్ప మరేమీ లేదని కనిపెట్టిందీ మెరె.నా వ్రుద్ది క్ష్యాలకు బోలెడన్ని అర్దాలు చెప్పె మీరు ,అప్పుడప్పుడూ వచ్చే గ్రహనాలకే బయపడె మీరు,అవన్నీ మర్చిపోయి ఏ ధైర్యంతొ నా దగ్గరకు వచ్చి నా మీదె నివాసం ఉండాలనుకుంతున్నరు?
అయినా నా దగ్గర ఉంది పిడికెడు నీరు.అది కూడా టన్నుల కొద్దీ నా మట్టిని పిండితే వచ్చే నీరు.మా సౌరకుటుంబమంతా కలసి మీ కోసం అంత జలరాసిని స్రుష్టించి ఇచ్చినా మీకు సరిపోలేదా?
ఓక మాట చెప్పనా ..ఆ కాస్త నీరె నన్ను చల్లగా ఉంచుతుంది.ఆ చల్లదనంతోనే మీకు సుఖమైన నిద్రను ఇస్తాను.దాన్ని కోల్పోవడానికి కూడా సిద్దపడుతున్నారె మీరు!
ఆంతే ఉంది అందులో .ఆ తరువాత నాలుగు కన్నీటి చుక్కలు కనిపించాయి.ఎంత మట్టిని పిండి పంపిందో పాపం.!