Monday, 24 September 2018

అర్థరాత్రి వచ్చి మసాజ్ చేస్తానన్నాడు

గతంలో టాలీవుడ్ పై పలు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన ఈ హీరోయిన్, తాజాగా తనకు ఎదురైన మరో చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. ఓ బాలీవుడ్ సినిమా సెట్స్ లో ఓ నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది రాధిక ఆప్టే. అర్థరాత్రి రూమ్ కు వచ్చి మసాజ్ చేస్తానని ఆఫర్ చేశాడని చెప్పుకొచ్చింది.
Radhika Apte
"రీసెంట్ గా నాకు ఎదురైన ఓ అనుభవం గురించి చెబుతాను. నిజానికి ఆ టైమ్ లో నాకు బాగా నడుము నొప్పి ఉంది. కానీ అలానే షూటింగ్ లో పాల్గొన్నాను. షూటింగ్ తర్వాత నేను లిఫ్ట్ లో నా రూమ్ కు వెళ్తున్నాను. అదే లిఫ్ట్ లో మరో నటుడు ఉన్నాడు. మా సినిమాలో అతడు కూడా నటిస్తున్నాడు. లిఫ్ట్ లో నాతో అతడు అసభ్యంగా మాట్లాడాడు. అర్థరాత్రి అవసరం అయితే ఫోన్ చేయమన్నాడు. వచ్చి నా నడుముకు మసాజ్ చేస్తానని నాతో చెప్పాడు."

అతడు అలా చెప్పడంతో తను షాక్ అయ్యానని, మర్నాడు పొద్దున్నే ఈ విషయంపై యూనిట్ కు ఫిర్యాదు చేశానని తెలిపింది రాధికా ఆప్టే. అయితే మసాజ్ చేస్తానంటూ ఆఫర్ ఇచ్చిన నటుడిపై సానుభూతి కూడా తెలిపింది రాధిక.

"రాత్రికి వచ్చి మసాజ్ చేస్తానని ఆఫర్ చేసిన ఆ నటుడికి నిజానికి అది తప్పనే విషయం తెలీదు. అతడు పెరిగిన వాతావరణం అలాంటిది. యూనిట్ మందలించడంతో వెంటనే నా దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు."

ఇలా రీసెంట్ గా తనకు ఎదురైన ఓ అనుభవాన్ని బయటపెట్టింది రాధికా ఆప్టే. లైంగిక వేధింపులకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాధిక ఆప్టే, మహిళలపై వేధింపులు ఏ రూపంలో జరిగినా అది తప్పేనని, వీటిని ఎప్పటికప్పుడు ఖండించాలని పిలుపునిచ్చింది.

Popular Posts