Wednesday, 5 September 2018

ట్రోల్స్ పై స్పందించిన నాని

బిగ్ బాస్ 2 రియాల్టీ షో చివరి దశకు చేరుకుంది. సోషల్ మీడియాలో తోలి నుంచి ఈ షోపై హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో హౌస్ లో జరిగే ప్రతివిషయం పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

గతవారం నూతన నాయుడు ఎలిమినేషన్ సరిగ్గా జరగలేదని, ఓట్లు ఎక్కువ వచ్చినా కావాలనే ఎలిమినేటి చేశారని షో నిర్వాహకులు, హోస్ట్ నానిపై ప్రేక్షకులు మండి పడుతున్నారు.

అంతా స్క్రిప్టెడ్ గేమ్ అని తనీష్ లేక గీత మాధురిల్లో ఒకరిని విజేతగా ప్రకటించడానికి బిగ్ బాస్ ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు. ఎలిమినేషన్ చేయాలనుకుంటే డైరెక్ట్ చేయాలనీ కానీ తమ ఓట్లు అడిగి అవమానించడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.

షో పై నమ్మకం పోయిందని, హోస్ నాని కూడా వారి పక్షాన నిలుస్తూ మద్దతు తెలుపుతున్నారని కామెంట్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా నాని మూవీ దేవదాస్ ని బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు.

ఇంకొందరు తమ అభిమాన హీరో నానినే తమని మోసం చేస్తున్నాడని, అతనిపై ఉన్న గౌరవడం పోయిందని అంటున్నారు. అయితే తాజాగా ఈ ట్రోల్స్ పై నాని ట్విట్టర్ లో స్పందించారు. ఆ లేఖలో ఏమున్నదో ఇక్కడ చూడొచ్చు.

Popular Posts