Wednesday, 26 September 2018

ట్విట్టర్ లో కాజోల్ ఫోన్ నెంబర్

పొరపాటున ట్విట్టర్ లో తన భార్య, నటి కాజోల్ మొబైల్ నెంబర్ ని షేర్ చేశాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్. అంతే నిమిషాల వ్యవదిలో ఆ ట్విట్టర్ వైరల్ అయింది. వేలమంది ఈ ట్విట్ ని వాచ్ చేశారు, వందల మంది కాజోల్ కు మెసేజ్ చేయడం మొదలుపెట్టారు. పొరపాటుని గమనించిన అజయ్ దేవగన్ ఫ్రాంక్ అని వివరణ ఇచ్చినా వినని అభిమానులు వాట్సాప్ లో మెసేజ్ లపై మెసేజ్ లు చేస్తున్నారు.

దాంతో ఏమి చేయాలో పాలుపోని అజయ్ దేవగన్ తలపట్టుకొని కూర్చున్నాడట. అజయ్ దేవగన్ ఏమని ట్విట్ చేశాడంటే....కాజోల్ ప్రస్తుతం ఇండియాలో లేదు....ఆమెను వాట్స్ యాప్ నెంబర్ సంప్రదించి సమన్వయం చేసుకోండి అని ఎవరికో పెట్టాల్సిన మెసేజ్ అందరికి కనిపించేలా ట్విట్టర్ లో పెట్టాడు.
Kajol Whatsapp Number Leaked in Twitter
Kajol Whatsapp Number Leaked in Twitter


Popular Posts