Monday 24 November 2014

ఇక నటనకు గుడ్ బై!

లాస్ ఏంజిల్స్:హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజిలీనా జోలీ నటనకు గుడ్ బై చెప్పనుందా? ఆమె దృష్టి నటన నుంచి దర్శకత్వం వైపు మళ్లిందా?అంటే ఆమె తాజా వ్యాఖ్యలను బట్టి అవుననక తప్పదు. తనకు కెమెరా ముందు నిలబడటం కంటే మెగా ఫోన్ చేతిలో పట్టుకోవడమంటేనే ఇష్టమంటోంది. అయితే తాను దర్శకురాలిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని హొయలు ఒలగబోస్తోంది. 'నాకు నటించడమంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. కెమెరా ముందు ఎప్పుడూ నిలబడాలన్నా అసౌకర్యంగా ఫీలయ్యేదాన్ని. ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫిల్మ్ మేకింగ్ పై దృష్టి పెడతా. దర్శకత్వ శాఖలో కూడా రాణిస్తానని ఆశిస్తున్నా' అని ఏంజిలీనా స్పష్టం చేసింది.

చివరిసారిగా ఏంజిలీనా 'మేల్ ఫీసెంట్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. గత మే నెల్లో విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింంది.

Friday 14 November 2014

త్రిష ఫోటోకి మీ కామెంట్ వ్రాయండి

Trisha Comment About This Photo on Twitter:
                  "Uber cool,multi-talented n one of d nicest people Iv worked wit"




Monday 10 November 2014

ముఖ్యగమనిక: మీ మెసేజిని చదివేశారు

న్యూయార్క్ : మీరు వాట్సప్ వాడుతున్నారా? అయితే ఈమధ్య అందులో మీరు పంపిన మెసేజిల పక్కన రెండు నీలిరంగు టిక్ మార్కులు వస్తున్నాయి కదూ. వాటికి అర్థం ఏంటో మీకు తెలుసా? మీరు పంపిన సందేశాన్ని అవతలివాళ్లు చదివారని. ఒక టిక్ వచ్చిందంటే అవతలి వాళ్లకు అది వెళ్లిందని అర్థం. అదే రెండు టిక్ మార్కులు ఉన్నాయంటే మాత్రం అవతలివాళ్లు దాన్ని చదివేసినట్లు కూడా తెలుస్తుంది. దీనికి ముందు, మన స్నేహితుల టైంలైన్ లో 'లాస్ట్ సీన్' అనే విభాగంలో ఏ సమయం ఉందో చూసుకుని, దాన్ని బట్టి మన సందేశం చదివారో లేదో తెలుసుకోవాల్సి వచ్చేది.

ఇది కాస్త ఇబ్బందికరంగా ఉండటంతో ఇప్పటికే మిగిలిన కొన్ని సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఉన్న రెండు నీలిరంగు టిక్ మార్కుల విధానాన్ని వాట్సప్ కూడా అందిపుచ్చుకుంది. ఇది చాలా సులభంగా, కచ్చితంగా ఉంటుందని వాట్పప్ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ కు 60 కోట్ల మంది యూజర్లున్నారు.