ఆ యువకుడు ఫేస్‌బుక్ ద్వారా ఓ యువతికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆమెకు పలు కహానీ కబుర్లు చెప్పాడు. ప్రేమించానన్నాడు. ఆ యువతిని నమ్మించి హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. చివరకు ఫేస్‌బుక్ అక్కౌంట్ క్లోజ్ చేసేశాడు. దీంతో మోసపోయానని భావించిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్గావ్‌కు చెందిన రాజన్ మల్హోత్రా అనే 22 సంవత్సరాల యువకుడికి 19 ఏళ్ల అమ్మాయి ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యింది. ఓ రోజు నేరుగా ఆ అమ్మాయి ముందు వాలాడు. ప్రేమిస్తున్నానని చెప్పి గుర్గావ్‌లోని హోటల్‌కు తీసుకెళ్లాడు.
అక్కడ పెళ్లి టాపిక్ వచ్చే సరికి మాట మార్చాడు. ఆమెను ఎలాగైనా అనుభవించాలనుకున్న రాజన్ ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. తనపై రాజన్ అత్యాచారం చేసినా మళ్లీ ఆమె కరిగిపోయింది. చివరకు అక్కడ నుంచి జారుకున్న రాజన్ తన ఫేస్‌బుక్ అక్కౌంట్ క్లోజ్ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.