విజయవాడ : ఆంధ్రా వాళ్లను ఎప్పుడూ తాము గో బ్యాక్ అనలేదని తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి చెప్పారు. ఆయన బుధవారం నాడు విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తమకు ఎప్పుడైనా నేతలతోనే తగాదా ఉంది తప్ప సామాన్య ప్రజలతో లేదని ఆయన స్పష్టం చేశారు.
అందుకే నాయకులను విమర్శించామే తప్ప.. ప్రజలను ఎప్పుడూ తెలంగాణ నుంచి వెళ్లాలని చెప్పలేదని నాయిని అన్నారు. ఇక మార్చి నుంచి తెలంగాణలోని బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతి ఇస్తామని కూడా ఆయన చెప్పారు.