తన అందంతో భారతీయ సినిమా రంగానికి తనవంతు సేవలు అందిస్తున్న సన్నీ లియోన్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. ఆ విషయం తెలిసిన చాలామంది అభిమానులు ఆ లిఫ్ట్ దగ్గర చేరి, దాన్ని కష్టపడి తెరిచి సన్నీ లియోన్ని రక్షించారు. ఆ తర్వాతే వాళ్ళు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. సన్నీ లియోన్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన సమయంలో ఆమెతోపాటు ఆమె భర్త డేనియల్ కూడా వున్నాడు.
ముంబైలో మ్యాన్‌డేట్ అనే మ్యాగజైన్‌ను ఆవిష్కరించేందుకు ఓ హోటల్‌కి సన్నీ లియోన్ దంపతులు వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. మ్యాన్‌డేట్ మ్యాగజైన్ కవర్ పేజీ మీద సన్నీ దంపతుల ఫొటోను ప్రచురించారు. ఆ సంచికను ఆవిష్కరించడానికి వచ్చిన సందర్భంగా ఈ సరదా సంఘటన జరిగింది. సన్నీ లియోన్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయేసరికి సన్నీ అభిమానులు, సెక్యూరిటీ సిబ్బంది టెన్షన్ పడ్డారుగానీ, సన్నీ లియోన్ మాత్రం చిరునవ్వులు చిందిస్తూ లిఫ్ట్‌లోంచి బయటకి వచ్చింది.