Sunday, 18 January 2015

తెనాలిలో యువతిపై పొలాల్లో అత్యాచారం

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని నమ్మించి ముగ్గురు వ్యక్తులు ఆమెను వేమూరు సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అత్యాచారం విషయాన్ని బయటకు చెపితే ఆమె తల్లిని, తమ్ముడిని చంపేస్తామని బెదిరించారు. అయితే ఆమె పోలీసులను ఆశ్రయించి ఆ యువకులపై ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పోలీసుల కథనం ప్రకారం స్థానిక రామలింగేశ్వరపేటకు చెందిన 20 ఏళ్ల వివాహిత భర్తతో విబేధాల కారణంగా దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో స్థానిక యువకులైన టి.గోపి, ఎం.ఆనంద్, పి.సుబ్బు ఆమెను మాయమాటలతో నమ్మించి పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం తెనాలి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Popular Posts