Thursday, 29 January 2015

యోగా గురు

శక్తి పెరిగే కొద్ది బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యత ఎంత ఎక్కువైతే అంతే స్థాయిలో ఒత్తిడిలు ఉంటాయి. ఆ రెండిటిని సమతుల్యం చేసినపుడే పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమ పనితీరు మరింత మెరుగు పరిచేందుకు ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుంది. రాష్ట్ర కేబినెట్‌ మంత్రుల నుంచి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల వరకు మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు యోగాసనాలలో శిక్షణ ఇప్పిస్తున్నారు.

ప్రముఖ యోగా గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆధ్వర్యంలో ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయ్‌ఫుల్‌ లివింగ్‌ పేరిట గురువారం నుంచి మూడు రోజుల పాటు యోగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం తొలి రోజు హైటెక్‌ సిటీలోని నోవాటెల్‌లో, శుక్ర, శనివారాల్లో కొండాపూర్‌లోని సైబర్‌ సిటీ కన్వెన్షన్‌లో నిర్వహిస్తారు.

Popular Posts