Friday 16 May 2014

ఇది తెలుసా మీకు?

గుడ్లగూబకీ పావురాయికీ ఒకసారి తగాదా వచిందట.నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నాయట.

మీరెంత మంది అంటే మీరెంత మందీ అనుకున్నాయట.తేల్చుకుందాం రా అనుకొని కొండ దిగువున వున్న
మైదానంలో అడవి అంచున వారం తరువాత కలుద్దామని అపాయింట్మెంట్ పెట్టుకున్నాయట.
ఆ రోజు రానే వఛింది.గుడ్లగూబలు తండోపతండాలుగా వఛి చెట్లపై వాలాయి.తగాదా పెట్టుకున్న పావురాయి మౌనంగా చూస్తూ
కూర్చుంది.లెక్క పెట్టుకుంటావా,ఓటమి ఒప్పుకుంటావా అని అడిగిందిప్రత్యర్ది గుడ్లగూబ దాన్ని.


ఒక్క నిముషం ఆగు అంది పావురాయి.
నిజంగా ఒక్క నిముషం గడిచిందో లేదో ఆకాశం బూడిద రంగులోకి మారిపోయింది.తూర్పునుంచి,పడమర నుంచి,ఉత్తరం నుంచి,దక్షినం నుంచి వందల
కొద్దీ పావురాలు.రెక్కలు టప టపా కొట్టుకుంటూ ఎగిరొఛాయి.వఛి కొండ పైనుంచి క్రింది దాకా,మైదాన మంతా నిండిపోయి నిలిచున్నాయి.ఇంకా వస్తూనే ఉన్నట్లు శబ్దం వస్తూనే ఉంది.
గుడ్ల గూబలు అలా చూస్తూనే ఉండి పోయాయి.
అదిగో అప్పటినుండే వాటి కనుగుడ్లు అలా పెద్దవైపోయాయి.
............
నమ్మ శక్యంగా లేదు కదూ!
నిజమే పావురాల చేతిలో చిన్న ఓటమికే అవి శశ్వితంగా అంత పెద్ద కనుగుడ్లు వేసుకుని తిరుగుతున్నాయంటే

ఈ రోజు 'మోదీ-బాబు ' ప్రభంజనంలో కొట్టుకుపోయిన ప్రత్యర్ధి పార్టీల వాళ్ళు ఎంత పెద్ద కనుగుడ్లు వేసుకుని తిరగాలో కదా?