Wednesday, 7 May 2014

' ఆయనొస్తున్నాడు! ' (Exclusive)

' ఆయనొస్తున్నాడు! '
ఓరేయ్ ప్రశాంత్! చానాళ్ళకు ఊళ్ళో కనిపించావ్ ఏంటి సంగతి ?
ఓటు వేయడానికొచ్చా 'ఆయనకి '
ఎవరా 'ఆయనా? '
టీ.వీ.ల్లో చూడలా? ఆయనొస్తున్నాడు!...
ఎవర్రా?
మీ మనుమడొస్తున్నాడు...దుమ్ము దులపడానికి.మీ మావయ్య వస్తున్నాడు..దుమ్ము దులపడానికి. ఆయనొస్తున్నాడు....ఆయనొస్తున్నాడు...అని అదే పనిగా చూపిస్తున్నారు చూడలా?
'నువ్వు చెప్పే ఆయన ఎవరికి తాతయ్య?,ఎవరికి మావయ్య? నీకా? '
కాదు
'పోనీ మీ బంధువులకా? '
కాదు,మా వోడు అందరికీ ఆత్మ బంధువని దీన్ని బట్టి అర్దం కాలా?మావోడు అధికారంలోకి వస్తే అందరి దుమ్మూ దులుపుతాడు.
'మీవోడి మీద చాలా కేసులు ఉన్నాయటగా రేపు ఎన్నికలు అవగానే వాటి దుమ్మూ దులుపుతారంటగా?'
మా వోడు పీట మీద కూర్చోగానే తనపై కేసులు పెట్టినోళ్ళ దుమ్ము దులుపుతాడు.
'ఆ ఇప్పుడు అర్దమయ్యిందిరా టి.వీ.ల్లో దుమ్ము దులపండి..దుమ్ము దులపండి......దుమ్ము దులపండి అని అంటే ఏందో'
మా వాడంటే ఏమనుకున్నవ్ మరి? ఎవడు కొడితే దుమ్ము రేగి దిమ్మ తిరిగిద్దో ఆడే మావోడు.
'సరేలే కానీ, మీ వాన్ని మాత్రం మా వూరు రావొద్దని చెప్పరా బాబు. మీవోడు మావూరు
వస్తే నువ్వు చెపినట్లు దుమ్ము రేగితే మావూళ్ళోని గుడిసెలూ,గడ్డి వాములూ కొట్టుకు
పోతాయేమో.'
ఎవరెన్నన్నా దుమ్ము లేపేవాడు మావోడే.!
'కాస్త ఆగూ రేపు ఎన్నికల ఫలితాలు వచ్చాక వచ్చే గాలి దుమ్ములో మీవోడూ, ఆయన అనుచరులూ చంచల్‌గూడా జైల్లో దుమ్ము దులుపుకోవాల్సి వస్తుందేమో అది చూసుకోండి ముందు'.

Popular Posts