Friday, 7 December 2018

వాళ్ళకి ఇక నిద్రలు లేనట్టే!

ఒక పక్క సర్వేలు అన్నీ తెరాసాకె మళ్లీ అధికారం అంటూ చెబుతూ ఉంటే, మరో పక్క ‘ఆంధ్రా ఆక్టపుస్’ లగడపాటి మాత్రం కూటమికే గెలుపు అవకాశం ఎక్కువగా ఉంది అని తేల్చి చెప్పేశారు. దాదాపుగా కూటమి పార్టీలు అన్నీ కలసి 65 కి అటూ ఇటూగా వస్తాయి అని లగడపాటి చెప్పేశారు. అంతే కాదు దాదాపుగా జిల్లాల్లో 80 శాతం కూటమికే ఫేవర్ గా ఉన్నట్లుగా కూడా ఆయన స్పష్టం చేసేసారు. ఇదిలా ఉంటే మరో పక్క ఎలా చూసుకున్న లగడపాటి లెక్క ప్రకారం తెరాసాకు తెలంగాణాన ప్రజలు చరమగీతం పాడనున్నారు అని అర్ధం అవుతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు.

అయితే మరో పక్క అందరిదీ ఒక గోల అయితే, కొందరిది ఇంకో గోల అన్నట్లు…ఏ పార్టీ గెలుస్తుందా అన్న మాట పక్కన పెడితే, నార్త్ ఇండియా సర్వేలు అన్నీ తెరాసాకి ఫేవర్ గా ఎగ్సిట్ పోల్స్ ఇవ్వగానే ఆనందంలో మునిగిపోయిన కొన్ని వర్గాలు, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన కొన్ని సామాజిక వర్గాలు, ఒక బడా హీరో అభిమానులు, ఆయా అభిమానుల వెనుక ఉన్న ఒక కోస్తా సామాజిక వర్గం పాపం లగడపాటి సర్వేని చూడగానే షాక్ కి గురయ్యారు. మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ద పెట్టి మరీ కేసీఆర్ ని గెలిపించాలి అని తెరాసాకు మద్దతుగా నిలిచిన వాళ్ళు కేసీఆర్ అండ్ పార్టీ మళ్లీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని భారీ ఆశలే పెట్టుకుని, భారీగానే బెట్టింగ్స్ కూడా కాసినట్లు తెలుస్తుంది.

అయితే ఈరోజు లగడపాటి చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కూటమికి ఆధిక్యం స్పష్టం అవనున్న తరుణంలో ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటో, అసలు రేపు 11న ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ సరిగ్గా నిద్ర పోతారో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ఇక మరో పక్క లగడపాటి జోస్యం నిజం అయ్యీ, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే త్వరలో అంటే వచ్చే నాలుగు నుంచి అయిదు నెలల్లో జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. అదే జరిగితే మాత్రం ఈసారి సీఎం సీట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న జగన్ మరియు పవన్ ఇద్దరూ ప్రతిపక్షానికి పరిమితం కాక తప్పదు.

Popular Posts