ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఈమధ్యన వైజాగ్ లో విమాక్స్ పేరుతో ఓ థియేటర్ కంప్లెక్స్ నిర్మించారు. ఆ కాంప్లెక్స్ వైజాగ్ లో జగదాంబ థియేటర్ల తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకుంది. అందుకు కారణం వినాయక్ క్రేజ్ .... ఆ థియేటర్స్ లో ఉన్న ఫెయిసిలిటీ. వినాయక్ దర్శకుడుగా వెలుగుతున్న రోజుల్లో రెండు పాత థియేటర్లను కొని అధునాతన వసతులను ఏర్పాటు చేసి విమాక్స్ పేరుతో డెవలప్ చేశాడు.
అతి తక్కువ సమయంలో ఆ థియేటర్లు సిటీలో సెంటరాఫ్ అట్రాక్షన్ కదా, లోకల్ జనాలకు మేజర్ స్పాట్ గా మారాయి. అయితే ఇప్పుడు ఆయా థియేటర్లు కూల్చేస్తున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీకి ఆ థియేటర్ కాంప్లెక్స్ ను అమ్మేశాడట వినాయక్. ఆ సంస్థ అక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. అంటే ఆ థియేటర్స్ త్వరలోనే కూల్చేస్తారని తెలుస్తోంది.
ఇక వి.వి.వినాయక్ ఈ కాంప్లెక్స్ అమ్మేయటాని కారణం ...మంచి రేట్ పలకడమే అని తెలుస్తోంది. అంతేతప్ప చాలా మంది భావిస్తున్నట్లు ఆర్దిక సమస్యలు ఏమీ లేవని, ఆయన వెల్ ఆఫ్ గా ఉన్నారని సమాచారం. ఇక వరస ఫ్లాఫ్ లతో ఉన్న వినాయిక్ ..సాయి ధరమ్ తేజ తో చేసిన మిస్టర్ ఇంటిలిజెంట్ సినిమా తర్వాత మరొక సినిమా కమిటవ్వలేదు. మంచి కథతో మళ్లీ స్టార్ హీరోతో ఆయన హిట్ కొట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు