Monday, 19 November 2018

కోలీవుడ్ లో అవకాశం కొట్టేసిన కమెడియన్

టాలీవుడ్ లో కమెడియన్ గా సునీల్ మంచి పేరును సంపాదించుకున్నాడు. ఆ తరువాత సునీల్ హీరో గా సినిమాలకు దగ్గరవ్వడం తో సునీల్ ప్లేస్ ని వెన్నెల కిషోర్ ని సొంతం చేసుకున్నారు . మెల్లి మెల్లిగా వెన్నెల కిషోర్ స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు . పెద్ద హీరో స్ తో తో వెన్నెల కిషోర్ నటిస్తూ ఇండస్ట్రీ లో మంచి పేరును సంపాదించుకున్నారు . తాజా సమాచారం ప్రకారం ఈ కమెడియన్ ఇప్పుడు కోలీవుడ్ లో మంచి ప్రాజెక్ట్ లో నటించేందుకు అవకాశాన్ని దక్కించుకున్నారు . శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న 'భారతీయుడు 2 ' సినిమా లో ఒక ముఖ్య పాత్రలో నటించేందుకు వెన్నెల కిషోర్ ఓకే చేసారు.

మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా.. అర్జెంట్‌గా ఇది చదవండి..!

మీరు ఎస్‌బీఐ బ్యాంక్ కస్టమరా? మీకు ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు నవంబర్ 30 వ తేదీలోగా మీ ఖాతాకు మొబైల్ నెంబర్‌ను లింక్ చేసుకోవాలి. లేదంటే మీరు మీ అకౌంట్‌కు సంబంధించి ఆన్‌లైన్ లావాదేవీలను చేసుకోలేరు. వాటిని బ్యాంక్ నిలిపివేయనుంది. ఈ విషయాన్ని బ్యాంకే స్పష్టం చేసింది. ఈ ప్రకటనను తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అంటే మీరు మీ మొబైల్ నెంబర్‌ను అకౌంట్‌కు ఈనెల 30 లోగా అనుసంధానం చేసుకోకపోతే డిసెంబర్ 1, 2018 నుంచి ఆన్‌లైన్ సేవలను ఉపయోగించుకోలేరు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. ఇప్పటి వరకు మొబైల్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోని వాళ్లు సంబంధిత బ్యాంక్ శాఖలో కానీ.. లేదా ఏటీఏంలో గానీ లింక్ చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది
To Link Mobile Number to your SBI account: Click on the below Link

Monday, 12 November 2018

హీరోయిన్ పెళ్లి ఫొటోల రేట్ రూ.18 కోట్లు?

బాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతూ ఉంది. ఇదే సీజన్లో నటి ప్రియాంక చోప్రా కూడా పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన నిక్ జోనస్ తో ఇప్పటికే ప్రియాంకకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తనకన్నా చాలా చిన్నవాడు అయిన నిక్ ను ప్రియాంక పెళ్లి చేసుకోబోతోందనేది తెలిసిన సంగతే. ఈ పెళ్లికి ఇరుపక్షాల పెద్దలూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నిశ్చితార్థం జరిగిపోయింది. ఇక పెళ్లి ఎప్పుడో ప్రకటించాల్సి ఉంది.

అయితే వీరి పెళ్లికి తేదీ ఖరారు అయ్యిందని, డిసెంబర్లో వీళ్ల పెళ్లి అని తాజాగా వార్తలు వస్తున్నాయి. వీరి వివాహ వేడుక భారీఎత్తున జరగనుందని.. ఏకంగా మూడురోజుల పాటు పెళ్లి జరగబోతోందని సమాచారం. ఈ వేడుకకు బాలీవుడ్, హాలీవుడ్ అతిరథులు హజరు కావచ్చని అంటున్నారు.

మరి అంతమంది ప్రముఖులు వస్తే.. ప్రియాంక, నిక్ జోనస్ లు వారి మధ్యన పెళ్లి చేసుకుంటే.. ఆ ఫొటోలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. నెటిజన్లు వాటి కోసం తెగ సెర్చ్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒక మీడియా సంస్థ ప్రియాంక పెళ్లి ఫొటోలపై మొత్తం రైట్స్ ను కొనేసిందని అంటున్నారు.

ఏకంగా 18 కోట్ల రూపాయల మొత్తానికి ప్రియాంక పెళ్లి ఫొటోలు, వీడియోలను అమ్మేసిందని.. బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది.

అందరిముందు కాజల్ ని కిస్ చేసాడు

"కవచం"లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ మరియు మెహ్రెయిన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు, హైదరాబాద్ లో  ఈ టీజర్ విడుదల కార్యక్రమం జరిగింది. 

ఈ వేడుక లో చలనచిత్ర సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు వేదికపై తన అసభ్యకర రీతి లో కాజల్ ని హఠాత్తుగా ముద్దు పెట్టుకున్నాడు . 

Sunday, 11 November 2018

2 ఓను లీక్ చేస్తామంటున్న తమిళ్ రాక్స్

శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తాజా సినిమా 2.ఓ త్వరలో రాబోతుంది. అయితే ఈ సినిమాని లీక్ చేస్తామంటూ పైరసీ వెబ్ సైట్ తమిళ్ రాక్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. తమిళ్ రాక్స్ లో 2.ఓ త్వరలో రాబోతుందని ప్రకటించింది. దాంతో రజనీకాంత్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కోట్లు పెట్టి సినిమా తీస్తే ఇలా చేయడం మంచిది కాదని అంటున్నారు. విజయ్ హీరోగా నటించిన సర్కార్ సినిమాని కూడా తమిళ్ రాక్ లీక్ చేసింది. అంతేకాదు బాలీవుడ్ సినిమా థగ్స్ అఫ్ హిందుస్థాన్ ను కూడా తమిళ్ రాక్స్ లీక్ చేసింది. ఒకవేళ నిజంగానే తమిళ్ రాక్స్ సినిమాని ఆన్లైన్ లో లీక్ చేస్తే తమిళ నిర్మాతలకు చాలా నష్టం జరుగుతుందని అంటున్నారు.

Thursday, 8 November 2018

హాట్ టీజర్‌తో మరింత హీటెక్కించారు

వెంకట్, హృశాలి గోసవిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఎ1 ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రాయల్ చిన్నా, నాగరాజు (పంచలింగాల బ్రదర్స్) నిర్మించిన చిత్రం ‘రాయలసీమ లవ్‌స్టోరీ’. రామ్ రణధీర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

దీపావళి కానుకగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఓయ్ లవ్ చేస్తున్నా అని చెప్పా కదా ఏం చేశావ్.. అంటూ మొదలైన ‘రాయలసీమ లవ్ స్టోరీ’ టీజర్ మెల్లగా రొమాంటిక్ మోడ్‌లోకి వెళ్లి పోవడం.. హీరో హీరోయిన్లు బాత్ రూం టబ్‌లో నగ్నంగా కామక్రీడలో తేలిపోతూ ఒకరి పెదాలను ఒకరు పెనవేసుకుని శృంగార రసాన్ని వరదలా పారించారు. అనంతరం ఎమోషన్ టర్న్ తీసుకుని హీరోయిన్ హీరో చెంపపై చెళ్లుమనిపించి నన్ను మరిపో అని బ్రేకప్ చెప్పేసింది. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన హీరో ఎలా మరిచిపోమంటావురా.. అన్నీ అయిపోయినవి చేతితో అసభ్యంగా సైగ చేస్తూ కమెడియన్ వేణు చెంపని పగలగొట్టేశాడు.

ఇక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ.. లెక్చరర్ పాత్రలో ‘ఇదిగో మీ లాంటి ఎదవల వల్లే.. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయి.. నిర్భయ కేసులు ఎక్కువైపోయాయ్’ అంటూ పంచ్‌లు పేల్చుతున్నాడు. ఇటీవల హీరో హీరోయిన్లు నగ్నంగా బాత్ టబ్‌లో పడుకుని ఉన్న మోషన్ పోస్టర్‌తో సినిమాపై హైప్ తీసుకువచ్చిన చిత్ర యూనిట్.. తాజా హాట్ టీజర్‌తో మరింత హీటెక్కించారు.

Popular Posts