Saturday, 24 November 2018

ఆంటీగా మారుతున్న కాజల్

కాజల్ అగర్వాల్ ఓ బంపర్ ఆఫర్ అందుకుంది. శంకర్ తదుపరి సినిమాలో ఆమె నటిస్తుంది. దర్శకుడు శంకర్ తన తదుపరి సింఎంగా భారతీయుడు 2 సినిమాని తీస్తున్నాడు. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా 20 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి సిక్వెల్.

ఈ సినిమాలో కమల్ వయసుమళ్ళిన సేనాపతి పాత్రలో కనిపించనున్నాడు. ఆయనకి భార్యగా కాజల్ నటించనుంది. కమల్ హాసన్ భార్య అంటే దాదాపు ఆంటీ పాత్రనే. ఆమె గెటప్ కూడా మిడిల్ ఏజ్డ్ ఆంటీగానే ఉంటుందట. 32 ఏళ్ళు వచ్చినా.... కాజల్ ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తుంది.

అందుకే రానా, శర్వానంద్, బెల్లంకొండ వంటి యువ హీరోల సరసన కూడా నటిస్తుంది. అయితే ఇప్పుడు కమల్ సరసన తన ఏజ్ కంటే చాలా పెద్ద వయసు ఆంటీగా కనిపించాలి. వచ్చే నెలలో కమల్ పై శంకర్ కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నాడు. ఐతే కాజల్ మాత్రం జనవరి నుంచి డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Popular Posts