Monday, 12 November 2018

హీరోయిన్ పెళ్లి ఫొటోల రేట్ రూ.18 కోట్లు?

బాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతూ ఉంది. ఇదే సీజన్లో నటి ప్రియాంక చోప్రా కూడా పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన నిక్ జోనస్ తో ఇప్పటికే ప్రియాంకకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తనకన్నా చాలా చిన్నవాడు అయిన నిక్ ను ప్రియాంక పెళ్లి చేసుకోబోతోందనేది తెలిసిన సంగతే. ఈ పెళ్లికి ఇరుపక్షాల పెద్దలూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నిశ్చితార్థం జరిగిపోయింది. ఇక పెళ్లి ఎప్పుడో ప్రకటించాల్సి ఉంది.

అయితే వీరి పెళ్లికి తేదీ ఖరారు అయ్యిందని, డిసెంబర్లో వీళ్ల పెళ్లి అని తాజాగా వార్తలు వస్తున్నాయి. వీరి వివాహ వేడుక భారీఎత్తున జరగనుందని.. ఏకంగా మూడురోజుల పాటు పెళ్లి జరగబోతోందని సమాచారం. ఈ వేడుకకు బాలీవుడ్, హాలీవుడ్ అతిరథులు హజరు కావచ్చని అంటున్నారు.

మరి అంతమంది ప్రముఖులు వస్తే.. ప్రియాంక, నిక్ జోనస్ లు వారి మధ్యన పెళ్లి చేసుకుంటే.. ఆ ఫొటోలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. నెటిజన్లు వాటి కోసం తెగ సెర్చ్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒక మీడియా సంస్థ ప్రియాంక పెళ్లి ఫొటోలపై మొత్తం రైట్స్ ను కొనేసిందని అంటున్నారు.

ఏకంగా 18 కోట్ల రూపాయల మొత్తానికి ప్రియాంక పెళ్లి ఫొటోలు, వీడియోలను అమ్మేసిందని.. బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది.

Popular Posts