మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా.. అర్జెంట్‌గా ఇది చదవండి..!

మీరు ఎస్‌బీఐ బ్యాంక్ కస్టమరా? మీకు ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు నవంబర్ 30 వ తేదీలోగా మీ ఖాతాకు మొబైల్ నెంబర్‌ను లింక్ చేసుకోవాలి. లేదంటే మీరు మీ అకౌంట్‌కు సంబంధించి ఆన్‌లైన్ లావాదేవీలను చేసుకోలేరు. వాటిని బ్యాంక్ నిలిపివేయనుంది. ఈ విషయాన్ని బ్యాంకే స్పష్టం చేసింది. ఈ ప్రకటనను తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అంటే మీరు మీ మొబైల్ నెంబర్‌ను అకౌంట్‌కు ఈనెల 30 లోగా అనుసంధానం చేసుకోకపోతే డిసెంబర్ 1, 2018 నుంచి ఆన్‌లైన్ సేవలను ఉపయోగించుకోలేరు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. ఇప్పటి వరకు మొబైల్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోని వాళ్లు సంబంధిత బ్యాంక్ శాఖలో కానీ.. లేదా ఏటీఏంలో గానీ లింక్ చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది

Popular posts from this blog

కొంపముంచిన మతిమరుపు.!

SBI పోర్టల్‌కు "ఐ బొమ్మ" లింక్!!

The 2012 pole shift has started