Thursday, 29 November 2018

కాజల్ అగర్వాల్ స్టన్నింగ్ పిక్ చూశారా?

కాజల్ అగర్వాల్.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది ఈ భామ. తన కెరీర్ ముగిసింది అని అనుకుంటున్న తరుణంలో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. మళ్లీ అగ్రహీరోల సరసన చాన్సులు దక్కించుకుంటోంది. మూడు పదుల వయసు దాటినా.. తనలోని అందాన్ని మాత్రం ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటూ సూపర్ ఫిట్ నెస్ ను మెయిన్ టేన్ చేస్తోంది కాజల్. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, తేజ కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తోంది కాజల్.

ఇక అసలు విషయానికి వస్తే.. రీసెంట్ గా కాజల్ తన స్టన్నింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విటమిన్ సీ అంటూ హ్యాష్ టాగ్ ను జత చేసింది కాజల్. ఇక.. తన స్టన్నింగ్ ఫోటోను చూసిన నెటిజన్లు కామెంట్లు చేయకుండా ఉండలేకపోతున్నారు. నిజంగానే నీ పిక్ స్టన్నింగ్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Popular Posts