కోపమొచ్చినప్పుడల్లా అంకెలు లెక్కపెట్టీ పెట్టీ విసుగొచ్చేసింది ఆయనకు.
పళ్ళు నూరాలనిపించినపుడల్లా పళ్ళు కనపడేలా నవ్వీ నవ్వీ అలసిపోయాడాయన.
ఆవేశాన్ని అనచుకోవాల్సొచ్చినపుడల్లా..శ్వాస మీద ధ్యాస పెట్టీ పెట్టీ ఊపిరి పీల్చుకోవడం మీదే విరక్తి వచ్చేసిందిఆయనకు.
వెధవ జీవితం.కోపం మంచిది కాదట.ఏడుపు,ధుఖం మనిషికి ఉండాల్సిన లక్షణాలే కావట.నిరాశను గుండు గుత్తగాఅంగారక గ్రహానికి ఎగుమతి చేయాలట.దేనిమీద విరక్తి కలిగినా విజేతల జీవితాల గురించి చదవాలంట.గడ్డిపోచనుండిధైర్యాన్నీ,గబ్బిలం నుండి తలక్రిందులుగా వేలాడె విద్యను….ఇలా ఏవేవో నేర్చుకోవాలట.పాజిటివ్ ఆలోచనల్నిఎండార్ఫిన్లుగా మార్చుకొని బతకాలట..ఊహు..!తనకోపము తన ఇష్టం అనుకున్నాడాయన.కానీ,తన కోపమే తనశత్రువని మరచిపోలేదాయన.
ఆలోచించగా చించగా ఆయనకు ఒక ఉపాయం తోచింది.
ఓ డ్రామా దుస్తుల కంపనీకి వెళ్ళి సెకండ్ హాండ్ దుస్తులను కొని ఇంటికి పట్టికెళ్ళాడు.
మర్నాటినుంచి చీటికీ మాటికీ తలుపులు బిడాయించుకోవడం మొదలుపెట్టాడు.ముఖ్యంగా పేపర్లుచదివినప్పుడు,వార్తల్ని చూసినపుడు లేచి లోపలికి వెళ్ళిపోయేవాడు.రాజశేఖరరెడ్డి మీద కోపం వచ్చినపుడుచంద్రబాబులా,చంద్రబాబు మేద కోపం వచ్చినపుడు రాజశేఖరరెడ్డిలా,పోలీసు మీద కొపం వఛి నపుడునక్సలైటులా,నక్సలైటుమీద కోపం వఛినపుడు పోలీసులా,టీచరుమీద కోపం వచ్చినపుడు విద్యార్దిలా,విద్యార్ది మీదకోపం వచ్చినపుడు టీచరులా,అమెరికా మీద కోపం వచ్చినపుడు ఇరాక్ లా,పిల్లి మీద కోపం వచ్చినపుడుఎలుకలా,మనిషిమీద కోపం వచ్చినపుడు ప్రక్రుతి లా…ఇలా గంట గంటకూ వేషం మార్చి అద్దం ముందు నిలబడి నోరారాఅవతలి వ్యక్తిని తిట్టి అన్ని బావోద్వేగాలనుండి విముక్తుడవటం నేర్చుకున్నాడు.
ఏడుపు ధుఖం నిరాశ వగైరాలన్నీ కోపం నుండే కదా పుట్టెది.
ఇప్పుడు ఆయన కోపమే ఆయనకు రక్ష.