ఆత్మాభిమానం,గౌరవం- ఇవి వేరెవరో వచ్చి రక్షించేవి కాదు,ఎవరికి వారేవాటిని కాపాడుకోవాలని ప్రబోదించారు మహాత్మాగాంధి.వ్యక్తికే కాదు ఓజాతికీ వర్తిస్తుంది ఆ స్పూర్తి.
దాదాపు 30 ఏళ్ళ నాడు అప్పటి ప్రధాని కొడుకుగా మన రాష్ట్ర పర్యటనకువచ్చి మన ముఖ్యమంత్రిని అవమానించిన రాజివ్ ఉదంతం తెలుగువాళ్ళింకా మరువలేదు.నాటి ఘటననుమర్చిపోయిన కొందరు నేతలు సోనియాను ప్రసన్నం చేసుకునేందుకు రాజివ్ నామ జపంతో తరించిపోతున్నారు.అమ్మదయ ఊంటే తప్ప రాజకీయంగా మెతుకూ,బ్రతుకూ ఉండదని దిగాలు పడే కొందరు నేతలు ఇప్పటికే రాష్ట్రంలోనిపతకాలన్నింటికీ రాజివ్,ఇందిర పేర్లు తగిలించేశారు.
రెండేళ్ళక్రితం రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముందు తెలుగుకు ప్రాచీన బాషా హోదా కల్పిస్తూ కేంద్రం నిర్నయంప్రకటించినపుడు అదంత తమ గొప్పేనని మన రాష్ట్ర ప్రభుత్వం టాం..టాం..వేసుకుంది.మన రాష్ట్రంలోని ఏకైకఅంతర్జాతీయ విమానాశ్రయానికి మన తెలుగు వారి పేరు పెట్తడానికి నిరాకరించి రాజివ్ భజనతో తరించిన ప్రభుత్వంఆత్మాభిమానం తమకు ఏ కోశానాలేదని ఎప్పుడో చాటుకుంది.
దేశ సేవలో తరించిన తెలుగువారెవరూ లేరన్నట్టుగా పధకాలన్నింటికీ రాజివ్,ఇందిర ల పేర్లు పెట్టడం మన ప్రభుత్వపనితనానికి పరాకాష్ట.
తెలుగుజాతి ఔనత్త్యాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వం వాటన్నింటినీ గాలికొదిలేసి తెలుగు జాతి ప్రతిష్టనుమంటగొల్పింది.తెలుగుగడ్డపై పుట్టిన ఈప్రభుత్వ నేతలకు తెలుగు పనికిరానిదైపోయింది.
హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లోని తెలుగు లలిత కళాతోరణం పేరు ఇప్పుడు రాజివ్ తెలుగు లలిత కలా తోరణంగామారిపోయింది.
తెలుగులలితకళతోరనం పేరు ముందు రాజివ్ పేరు తగిలించి ఈ ప్రభుత్వం తాజాగా తనకు తెలుగుపై వున్న 'చిత్తశుద్ధినిచాటుకుంది.ఇలాంటి ఈ ప్రభుత్వాన్ని క్షమిస్తే తెలుగుతల్లి ఆత్మ క్షోభిస్తుంది.