Tuesday 16 November 2010

సత్యమా…సాహసమా!


త్రూత్ ఆర్ డేర్ అని ఇంగ్లీషువాళ్ళు ఆడుకొనే ఆట ఒకటి ఉంది.పిల్లలు,పెద్దలు అందరూ ఆడుతారు దీన్ని.
ఐదుమంది పదిమంది ఎందరైనా ఆడొచ్చు.ప్రతి ఒక్కరికీ చాన్స్ ఉంటుంది.ఎవరి వంతు వస్తే వాళ్ళను సత్యమా సాహసమా అని అడుగుతారు.సత్యమని చెపితే వాళ్ళు జవాబు చెప్పడానికి ఇబ్బందిపడే ప్రశ్న ఏదో అడుగుతారు.నిజమే చెప్పాలి,లేదా నిజంలా ద్వనించే జవాబు చెప్పలి.ఒకవేళ ప్రశ్న వద్దనుకొంటే ఏదో ఒక సాహసం చేసి చూపాలి.మొదటిది త్రూత్,రెండోది డేర్ అన్నమాట.
ఏ ఆటను మనం కాస్త సీరియస్ గా ఆడుకొన్నామనుకోండి.
ఉదాహరనకు నిజం నిప్పులాంటిదని ఎందుకు అంటారు?గాలిలాంటిదనో,వానలాంటిదనో,మెరుపులాంటిదనో,ఉరుములాంటిదనో ఎందుకు అనరు?పోనీ ప్రాస కోసం అంటారనుకొంటే నీళ్ళ లాంటిదనొచ్చుగా.వర్షంలా భూమ్మేద పడినపుడు ఒకలా,నదిలో చేరి ప్రవహించినపుడు ఒకలా,చెరువులో నిలిచిపోయినపుడు ఒకలా,మురికిగుంటలో నిలవున్నపుడు ఒకలా,ఆకులనుంచి బొట్లు బొట్లుగా పడినపుడు ఒకలా కనపడుతుందని దానికి ఎన్ని విశేషనాలు జోడించే అవకాశం ఉంది.!
నిజం నిప్పులా ఉంటుందనటంలో ఇంకో అస్పష్టత ఉంది.
ఇలాంటి ప్రశ్న ఎవరైనా అడిగితే ఏమని జవాబు చెప్పలి?
సత్యం మాట్లాడి చరిత్రకెక్కినవాళ్ళు దేశంలో ఇద్దరే ఇద్దరు ఎందుకున్నారు?
ట్రూత్ వదిలేసి డేర్ కి వెలదామనుకొంటే అవి రెండూ వేరు వేరు అనిపించడంలేదు.మరి ఆ ఆటకు ఆ పేరు ఎందుకు పెట్టారో..?