Tuesday, 16 November 2010

జల జాబిల్లి

చంద్రుడి మీద నీళ్ళున్నాయని తెలియగానే చాలమంది బుర్రల్లో కొత్త ఆలోచనలు తళుక్కుమన్నాయి.
మల్టీనేషనల్ కంపెనీలు ముందుచూపుతో మల్టీప్లానిటరీ కంపనీలుగా పేరు మార్చుకొని అన్నిరకాల ఫాక్టరీల కోసం గనుల కోసం,సెజ్ ల కోసం దరఖాస్తులు పెట్టేసుకొన్నాయి.
ఇన్ ఫ్రాడవలప్ మెంట్ కంపెనీలన్నీ కలసి కన్సార్టియంగా ఏర్పడి రోడ్లు,విమానాశ్రయాలూ,హౌసింగ్ కాలనీలు,ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడానికి టెండర్లు సిద్దం చేసుకోసాగాయి.
శాస్త్రవిగ్నానంలో చంద్రుడిగురించి వున్న సమాచారాన్నంతా క్రోడీకరించి అక్కడికి వెళ్ళడానికి అవసరమైన పరికరాలూ,వస్తువుల్నీ డిజైన్ చేయడంలో మానిఫాక్చరింగ్ ఇండస్ట్రీ యమ బిజీగా ఉంది.
ఆన్ని ప్రపంచ బాషల్లో చంద్రుడిమీద ఉన్న కథలూ,కాకరకాయలూ కలిపి ఓ వెయ్యి పుస్తకాల సెట్ ను ముద్రించే పనిలో పడ్డారు పబ్లిషర్లు.
ఇదంతా చంద్రుదికి ఎలాగో తెలిసింది.ఎలాగో ఏమిటిలే మనం ఇంత దూరమ్నుండి అక్కడి నీటి వాసనను పసిగట్టగాలేనిది అది ఓ వెన్నెల రాత్రి భూమి మీద జరిగే విషయాలను తెలుసుకోలేదా ఏమిటి?వెంటనే నాసాకు ఏవో సంకేతాలు పంపింది.వాటిని డీకొడ్ చేసి చదివితే అర్దమైందేమిటంటే-
ఇంతకాలం ఒక కుందేలు,ఒక అవ్వ మాత్రమె ఉందని నమ్మిన మీరు ఇప్పుడు ఆ అబిప్రాయం ఎందుకు మార్చుకొన్నారు?
మీ ద్రుష్టిలో ఎవర్ని నేను అసలు?సూర్యుడి బార్యనా,చెల్లెల్నా,భూమి కూతుర్నా,అమ్మనా?ఆడదాన్న,మగవాడీనా?మంచిదాన్నా,చెడ్డదాన్నా?తేల్చుకున్నరా ఇప్పుడైనా?నన్ను చూస్తే సముద్రాలు పొంగుతాయని మీరే అంటారు.మనుషుల్లో ఉన్మాదం పెచ్చుమీరుతుందని మేరే అంటారు.ఏది నిజం?
నాలో అమ్రుతం ఉందని ఊహించిందీ మేరే,మట్టి తప్ప మరేమీ లేదని కనిపెట్టిందీ మెరె.నా వ్రుద్ది క్ష్యాలకు బోలెడన్ని అర్దాలు చెప్పె మీరు ,అప్పుడప్పుడూ వచ్చే గ్రహనాలకే బయపడె మీరు,అవన్నీ మర్చిపోయి ఏ ధైర్యంతొ నా దగ్గరకు వచ్చి నా మీదె నివాసం ఉండాలనుకుంతున్నరు?
అయినా నా దగ్గర ఉంది పిడికెడు నీరు.అది కూడా టన్నుల కొద్దీ నా మట్టిని పిండితే వచ్చే నీరు.మా సౌరకుటుంబమంతా కలసి మీ కోసం అంత జలరాసిని స్రుష్టించి ఇచ్చినా మీకు సరిపోలేదా?
ఓక మాట చెప్పనా ..ఆ కాస్త నీరె నన్ను చల్లగా ఉంచుతుంది.ఆ చల్లదనంతోనే మీకు సుఖమైన నిద్రను ఇస్తాను.దాన్ని కోల్పోవడానికి కూడా సిద్దపడుతున్నారె మీరు!
ఆంతే ఉంది అందులో .ఆ తరువాత నాలుగు కన్నీటి చుక్కలు కనిపించాయి.ఎంత మట్టిని పిండి పంపిందో పాపం.!

Popular Posts