Saturday, 25 September 2010

ఇదే అదృష్టం!

ఇదే అదృష్టం
స్వైన్ ఫ్లూ రోజుల్లో ఒట్టి ఫ్లూ రావడమే అదృష్టం.
గుండె పోట్ల రోజుల్లో గుండె కేవలం రివర్సయి డెంగూ గా రావడమే అదృష్టం.
టీవి చూసి గుండె ఆగే రోజుల్లో కరెంటు కోత ఉండటమే అదృష్టం.
టెర్రరిస్టులకు భయపడే రోజుల్లో జేబుదొంగలు తారసపడటమే అదృష్టం.
బ్యాంకులు దివాలా తీసే రోజుల్లో డబ్బులు లేకపోవడమే అదృష్టం.
ఉద్యోగాలు పోయే రోజుల్లో చదువులేకపోవడమే అదృష్టం.
అమెరికాకు ఆర్దికమాంద్యం వచ్చిన రోజుల్లో వీసా దొరకకపోవడమే అదృష్టం.
కందిపప్పు కొనలేని రోజుల్లో దానికి రుచి లేకుందా పోవడమే అదృష్టం.
సన్నబియ్యం దొరకని రోజుల్లో సన్నబడాల్సిరావడమే అదృష్టం.
ఆడపిల్లల్ని కననివ్వని రోజుల్లో గర్భం దాల్చకపోవడమే అదృష్టం.
ప్రేమికులు ఆసిడ్ బాటిళ్ళతో తిరిగే రోజుల్లో ఎవరి ప్రేమకూ నోచుకొకపోవడమే అదృష్టం.
మానసిక సౌందర్యాన్ని గుర్తించలేని రోజుల్లో శారీరక సౌందర్యం లేక పోవడమే అదృష్టం.
పెళ్ళిళ్ళ ఖర్చు ఆకాశాన్నంటే రోజుల్లో పెళ్ళికొడుకులూ ,కూతుళ్ళు దొరకకపోవడమే అదృష్టం.
స్వయంగా మొగుళ్ళే యముళ్ళుగా మారుతున్న రోజుల్లో అనాదలుగా బ్రతకడమే అదృష్టం.
వర్షాలు పడని రోజుల్లో వలస పోగలగటమే అదృష్టం.
నాయకులు లేని రోజుల్లో వినాయకుడు ఉండటమే అదృష్టం.
పుట్టగొడుగులమద్య బ్రతికే రోజుల్లో నిజం గొడుగు క్రింద నిలబడగలగటమే అదృష్టం.
తలవంచి బ్రతకడం తప్పనిసరైన రోజుల్లో తలల్లో ఏమీ లేకుండా ఉండటమే అదృష్టం.
అబద్దాలు ప్రచారమయ్యే రోజుల్లో నిజాలు నిలకడమీద తలుస్తాయని ఆశించడమే అదృష్టం.
నేరుగా తిట్టలేని రోజుల్లో పిట్టకధలు చెప్పి కోపం తీర్చుకోగలగటమే అదృష్టం.

Popular Posts