Monday, 10 December 2018

ప్రజాకూటమిలోకి మజ్లిస్! అసదుద్దీన్ స్పందన...

తెలంగాణలోఎన్నికల ఫలితాలు వెలువడనున్న వేళ రాజకీయాల్లో అనూహ్యా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇందులో భాగంగా ‘మా సొంతబలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అన్న తెరాస ప్రకటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ… దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూస్తామనితెలిపారు.  శనివారం  భాజపా నేత లక్ష్మణ్‌మాట్లాడుతూ మజ్లిస్‌, కాంగ్రెసేతరపార్టీతో తాము కలుస్తామని పరోక్షంగా తెరాసకు సానుకూల సంకేతాలు పంపిన విషయంతెలిసిందే.

ప్రజాకూటమిలోకి రావాలన్న కాంగ్రెస్‌ ఆహ్వానంపై ఆలోచించి నిర్ణయంతీసుకుంటామన్నారు. తెలంగాణలో గెలుపై రాజకీయ పార్టీలు ఆధారాలు లేకుండా అంచనావేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో  ఎంఐఎం  కనీసం 7 స్థానాలు గెలవనున్నట్లు  వస్తున్న సర్వేలపై రాజకీయ పార్టీల చూపు ఎంఐఎం పై ఉండటంతో ఫలితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

Saturday, 8 December 2018

కూటమిదే విజయం, ప్రగతి భవన్ వీడేందుకు ముహూర్తం చూసుకోండి

తెలంగాణలో ప్రజాకూటమి విజయంపై పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్‌ ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో ప్రజాకూటమి 65 నుంచి 80 స్థానాలతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

శనివారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన జాతీయ మీడియా దక్షిణ భారతదేశ నాడిని సరిగ్గా పట్టుకోలేకపోయిందని విమర్శించారు. తెలంగాణలో తామే అధికారంలోకి వస్తున్నట్లు జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రగతిభవన్ వదిలేసేందుకు ముహూర్తం చూసుకోవాలని సూచించారు.

తమ నేతలు రేవంత్ ఇంటిపై, మధుయాష్కీ, వంశీ చంద్‌రెడ్డిపై అసహనంతో దాడులు చేశారని కుమార్ ఆరోపించారు. ఈ నెల 11న లెక్కింపు పూర్తయ్యే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

నియంత పాలనను గద్దె దించాలని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారని తమ సర్వేలో వెల్లడైందన్నారు. నిరుద్యోగ భృతి, తాము చేపట్టబోయే సంక్షేమ పథకాలు, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని భావిస్తున్నట్లు కుసుమ కుమార్ తెలిపారు. 

Friday, 7 December 2018

ఒక సారిగా కేసీఆర్ కాళ్ళ కింద భూమిని కంపింపచేసిన లగడపాటి

ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణాలో పోలింగ్ పూర్తి అయ్యింది. 72% కు తక్కువ కాకుండా పోలింగ్ నమోదు అయినట్టు సమాచారం. పోలింగ్ పూర్తవ్వగానే వరుసగా జాతీయ మీడియా ఛానళ్ళు తమ సర్వే రిపోర్టులు ప్రకటించడం మొదలు పెట్టాయి. ప్రతి సర్వేలోనూ తెరాసకు మెజారిటీ ఇచ్చి, మహాకూటమికి ఓటమి తప్పదు అని సంకేతాలు ఇచ్చాయి. ఈ క్రమంలో ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మీడియా ముందుకు వచ్చి తెలంగాణ ఎన్నికలు రసకందాయంలో పడేశారు. ఆయన మహాకూటమికి స్పష్టమైన మెజారిటీ ప్రకటించారు.

మహాకూటమిలోని అన్ని పార్టీలను కలిపి 65 (+/-10 సీట్లు) రావొచ్చని చెప్పారు. ఇదే క్రమంలో అధికార తెరాస పార్టీకి 35 (+/-10 సీట్లు) మాత్రమే వస్తాయని చెప్పుకొచ్చారు. అదే విధంగా బీజేపీకి 7 (+/-2 సీట్లు), ఎంఐఎంకి 6-7 సీట్లు, ఇండిపెండెంట్లకు 7 (+/-2 Seats), మరియు బీఎల్ఎఫ్ కు ఒక సీటు రావొచ్చని చెప్పుకొచ్చారు. మహాకూటమిలో టీడీపీకి 5-7 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు ఆయన. దీనితో మహాకూటమి క్యాంపులో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.


అదే సమయంలో తెరాస క్యాంపులో ఒక్క సారిగా అయోమయంకు గురయ్యారు. ఎన్నికలకు ముందు లగడపాటి చెప్పిన సర్వే కావాలని చంద్రబాబుకు అనుకూలంగా మార్చి చెప్పారని వారు అనుకుని సరిపెట్టుకున్నా, ఇప్పుడు ఎన్నికల తరువాత అబద్ధం చెప్పి ఆయన విశ్వసనీయత పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అని అలోచించి ఆందోళనకు గురవుతున్నారు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఒక్క సారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ నెల 11న ఫలితాలు అధికారికంగా విడుదల కాబోతున్నాయి. ఈ సస్పెన్స్ అప్పటిదాకా కొనసాగుతుంది. మరో పక్క తెరాస గెలుపుపైనే ఎక్కువగా పందాలు జరగడంతో ఏం జరగబోతుందో అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో ప్రభావం చూపించబోతున్నాయి. మహాకూటమి గెలిస్తే గనుక దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఉండే అవసరం ఏర్పడుతుంది. అదే విధంగా జాతీయ రాజకీయాలలో చంద్రబాబు ఇమేజ్ అమాంతం పెరుగుతుంది. ఆరు నెలలో ఎన్నికలకు వెళ్లబోయే ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ అనుకూల పవనాలు వీయడం ఖాయం.

వాళ్ళకి ఇక నిద్రలు లేనట్టే!

ఒక పక్క సర్వేలు అన్నీ తెరాసాకె మళ్లీ అధికారం అంటూ చెబుతూ ఉంటే, మరో పక్క ‘ఆంధ్రా ఆక్టపుస్’ లగడపాటి మాత్రం కూటమికే గెలుపు అవకాశం ఎక్కువగా ఉంది అని తేల్చి చెప్పేశారు. దాదాపుగా కూటమి పార్టీలు అన్నీ కలసి 65 కి అటూ ఇటూగా వస్తాయి అని లగడపాటి చెప్పేశారు. అంతే కాదు దాదాపుగా జిల్లాల్లో 80 శాతం కూటమికే ఫేవర్ గా ఉన్నట్లుగా కూడా ఆయన స్పష్టం చేసేసారు. ఇదిలా ఉంటే మరో పక్క ఎలా చూసుకున్న లగడపాటి లెక్క ప్రకారం తెరాసాకు తెలంగాణాన ప్రజలు చరమగీతం పాడనున్నారు అని అర్ధం అవుతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు.

అయితే మరో పక్క అందరిదీ ఒక గోల అయితే, కొందరిది ఇంకో గోల అన్నట్లు…ఏ పార్టీ గెలుస్తుందా అన్న మాట పక్కన పెడితే, నార్త్ ఇండియా సర్వేలు అన్నీ తెరాసాకి ఫేవర్ గా ఎగ్సిట్ పోల్స్ ఇవ్వగానే ఆనందంలో మునిగిపోయిన కొన్ని వర్గాలు, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన కొన్ని సామాజిక వర్గాలు, ఒక బడా హీరో అభిమానులు, ఆయా అభిమానుల వెనుక ఉన్న ఒక కోస్తా సామాజిక వర్గం పాపం లగడపాటి సర్వేని చూడగానే షాక్ కి గురయ్యారు. మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ద పెట్టి మరీ కేసీఆర్ ని గెలిపించాలి అని తెరాసాకు మద్దతుగా నిలిచిన వాళ్ళు కేసీఆర్ అండ్ పార్టీ మళ్లీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని భారీ ఆశలే పెట్టుకుని, భారీగానే బెట్టింగ్స్ కూడా కాసినట్లు తెలుస్తుంది.

అయితే ఈరోజు లగడపాటి చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కూటమికి ఆధిక్యం స్పష్టం అవనున్న తరుణంలో ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటో, అసలు రేపు 11న ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ సరిగ్గా నిద్ర పోతారో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ఇక మరో పక్క లగడపాటి జోస్యం నిజం అయ్యీ, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే త్వరలో అంటే వచ్చే నాలుగు నుంచి అయిదు నెలల్లో జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. అదే జరిగితే మాత్రం ఈసారి సీఎం సీట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న జగన్ మరియు పవన్ ఇద్దరూ ప్రతిపక్షానికి పరిమితం కాక తప్పదు.

Thursday, 6 December 2018

నెటిజన్స్ మెచ్చిన ఫోటో ఇదే

ఈ ఏడాది ప్రముఖ సామజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా నెటిజన్స్ ఏ విషయాలను ఎక్కువగా మాట్లాడారు, వేటిని ఎక్కువగా మెచ్చరు అనే జాబితాని ట్విట్టర్ ఇండియా 2018 తాజాగా విడుదల చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అయన సతీమణి బాలీవుడ్ నటి అనుష్క శర్మ కార్వా చౌత్ వేడుకలు చేసుకున్న ఫోటో నెటిజన్స్ అత్యంత ఇష్టమైందిగా నిలిచింది.

అక్టోబర్ నెలలో విరుష్క దంపతులు కార్వాచౌత్ వేడుకలను జరుపుకొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి వెన్నెల వెలుగులో ఉన్న ఫొటోను విరుష్క జంట సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఈ ఏడాది అత్యధిక మంది నెటిజన్లు మెచ్చిన ఫొటోగా ఇది నిలిచింది. ఈ ఫొటోకు దాదాపు 2,15,000 లైక్స్‌ వచ్చాయి. ఈ ఏడాది మొత్తం మీద భారత్‌లో ఎక్కువగా ట్రెండ్‌ అయిన 10 హ్యాష్‌ట్యాగ్‌లలో ఏడు దక్షిణ చిత్రపరిశ్రమకు చెందినవే కావడం గమనార్హం.

Wednesday, 5 December 2018

అగ్గి రేపుతున్న ప్రగ్య

అందంతో కవ్వించడం, యూత్ గుండెల్లో తిష్ట వేయడం అందాల ప్రగ్య జైస్వాల్ కి కొత్తేమి కాదు. కంచె సినిమాలో సంప్రదాయబద్ధంగా కనిపించినప్పటికీ ఆ తర్వాత తనలోని గ్లామర్ యాంగిల్ అందరికి పరిచయం చేసింది ఈ అందాల భామ. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన ఆకాశం కోసం చాలా ప్రయత్నిస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సిరా నరసింహరెడ్డి లో అవకాశం అందుకుంది. అలాగే ఈ భామ బాలీవుడ్లో హీరోయిన్ గా నటించే ప్రయత్నాల్లో ఉందని తెలుస్తుంది. ఆ ఆలోచనతోనే ఇటీవల రూటు మార్చిన ఈ అమ్మడు సామాజిక మాధ్యమాల్లో వేడెక్కించే ఫోటో షూట్స్ తో చెలరేగిపోయింది.

మొన్నటి మొన్న తన దేహాన్ని టైట్ గా హత్తుకొనిపోయే జిమ్ డ్రెస్ లో ప్రగ్య దర్శనమిచ్చి షాక్ ఇచ్చింది. ఈ అమ్మడు అగ్గి రాజేసిందంటే అతిశయోక్తి కాదు. తాజాగా మరో వేడెక్కించే ఫొటోతో సెగలు రేపుతోంది. ప్రగ్యను ఇలా చేశాక అయినా మన దర్శకనిర్మాతలు, స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వకుండా ఉంటారా?
for more photos: click on the below image/link

దర్శకుడు శంకర్ సంచలన నిర్ణయం

గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమా ఎంత భారీ స్ధాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. తాజా చిత్రం 2.0 దాదాపు 550 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందించారు. రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్‌తో 2.0 దూసుకెళుతోంది. ఈ సినిమా త‌ర్వాత శంక‌ర్ భార‌తీయుడు 2 తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ న‌టించే ఈ సినిమా త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే... శంక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. బారతీయుడు 2 సినిమాలో గ్రాఫిక్స్‌ని నమ్ముకోవట్లేదట‌. గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీయాల‌నుకుంటున్నాడ‌ట‌. భారతీయుడులో లాగే ఇందులో సమాజంలో పేరుకుపోయిన అవినీతి మీద కథ నడుస్తుందట‌. కాకపోతే భారతీయుడు ఈ కాలంలో ఉన్న టెక్నాలజీ ఎలా వాడుకుంటాడు, పోలీసులకు ఇంకెంత సవాల్ విసురుతాడు అన్న అంశాలు అదనంగా ఉండబోతున్నాయంట. మ‌రి.. ఈ సినిమాతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Popular Posts