Sunday, 17 February 2019

ఎన్టీఆర్ ని ఎందుకు వదిలేశారో

2017, 2018 సంవత్సరం కు గాను సుబ్బిరామిరెడ్డి జాతీయ అవార్డు ప్రకటించారు. ఆనవాయితీ ప్రకారం, హీరోలు, హీరోయిన్లు అందరికి ఏదో ఓ పేరు చెప్పి అవార్డులు ఇచ్చేశారు. ఆ జాబితాలో లేని హీరో అంటూ లేడు. ఒక్క ఎన్టీఆర్ తప్ప. ఎన్టీఆర్ కావాలనుకుంటే అరవింద సామెత వీరరాఘవ సినిమాకి గాను, అవార్డు ఇవ్వొచ్చు. కానీ, కే. సుబ్బిరామిరెడ్డి ఎన్టీఆర్ ని విస్మరించారు.

దీనికి కారణం అంటూ ఏమి లేదు. 2017 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడు ఖాతాలో నందమూరి బాలకృష్ణకు అవార్డు ఇచ్చారు. ఎన్టీఆర్ కి కూడా అవార్డు ఇస్తే బాలయ్య ఆ వేడుకకి వస్తాడో, రాడో అన్నది సుబ్బిరామిరెడ్డి అనుమానం. అందుకే, ఆ రిస్క్ చేయలేకపోయాడు కెఎస్ఆర్. బాలకృష్ణ-ఎన్టీఆర్ మధ్య దూరం ఇటీవలే తగ్గినట్లు అనిపించింది. ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు ఫంక్ష‌న్‌ని జూనియ‌ర్ వ‌చ్చి వెళ్లాడు.

అంత‌కు ముందు అర‌వింద స‌మేత స‌క్సెస్ మీట్ లో బాల‌య్య అతిథిగా మెరిశాడు. ఈ తాజా ప‌రిణామ‌ల‌తో ఇద్ద‌రి మ‌ధ్య దూరం తగ్గింద‌నుకున్నారంతా. కానీ… అది అలానే కొన‌సాగుతోంద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆ రిస్కు తీసుకోవ‌డం ఇష్టం లేక‌.. బాల‌య్య కోసం ఎన్టీఆర్‌ని వ‌ద్ద‌నుకున్నాడు కేటీఆర్‌. అందుకే సుబ్బిరామిరెడ్డి అవార్డుల జాబితాలో ఎన్టీఆర్ పేరు క‌నిపించ‌లేదు.

Popular Posts