Monday 11 February 2019

ఆ క్రీమ్ వాడితే అమ్మాయిలకు పెళ్లవుతుందా?

ఆ క్రీమ్ వాడితే అమ్మాయిలకు పెళ్లవుతుందా? లేకుంటే పెళ్లి కాదా? అని హీరోయిన్ శ్రీయ ప్రశ్నిస్తుంది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో తాను నటించబోనని స్పష్టంచేసింది. ఇటీవలి కాలంలో ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ వ్యాపార ప్రకటనపై స్పందించిన ఆమె, తానూ ఆదినుంచి కొన్ని రకాల వాణిజ్య ప్రకటనలను వ్యతిరేకినని, ఫెయిర్ నెస్ క్రీమ్ వాడితే తెల్లగా ఆవులారని, వారికి తొందరగా పెళ్లి అవుతుందని ఆమధ్య వచ్చిన ఓ ప్రకటన తనకు నచ్చలేదని చెప్పింది.

మొదట ఆ కమర్షియల్ ప్రకటనలో నటించాలని తననే సంప్రందించారని, దాన్ని తానూ తిరస్కరించానని చెప్పింది. దీనిపై ఆమె స్పందిస్తూ.... సదరు క్రీమ్ వాడితే అమ్మాయిలకు పెళ్లవుతుందా? లేకపోతె కాదా? తెల్లగా ఉండాలన్నది చర్మ సౌందర్యానికి సంబందించిన విషయం. స్వతహాగానే అది వస్తుంది తప్ప ఏ క్రీమ్ లు వాడినా రాదూ. ఈ తరహా అసత్యపు యాడ్స్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం నాకు నచ్చదు. అందుకే పలు ప్రకటనలకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నా నేను ఒప్పుకోను అని తేల్చేసింది.