చెన్నై సుందరి త్రిషకు ప్రియుడు వరుణ్ మణితో పెళ్లి కుదిరింది. ఇందులో భాగంగా ఈనెల 23వతేదీన త్రిషకు నిశ్చితార్థం జరుగనుంది. వివాహం మాత్రం మార్చి నెలలో ఉంటుందని పేర్కొంది. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్‌లో తెలిపింది. దీంతో ఈ అమ్మడు ట్విట్టర్ ఇన్‌బాక్స్ అంతా అభినందనలతో నిండిపోయింది.
అయితే, తన పెళ్లి తేదీ గురించి ఎలాంటి ప్రచారం చేయవద్దని, ఇంకా తాము తేదీ ఖరారు చేయలేదని చెప్పింది. వివాహం ఎప్పుడనేది తానే స్వయంగా చెబుతానని త్రిష అభిమానులనుద్దేశించి పేర్కొంది. అలాగే, నిశ్చితార్థం కూడా ఓ ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహిస్తున్నట్టు తెలిపింది.
అదేసమయంలో వివాహం చేసుకున్న తర్వాత కూడా సినిమాల నుంచి వెళ్లిపోయే ప్రసక్తే లేదని, త్వరలో రెండు సినిమాలను ఒప్పుకోనున్నానని వివరించింది. ఈ యేడాది నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయని తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడుకి కాబోయే వరుడు వరుణ్ మణి నిశ్చితార్థానికి బహుమానంగా ఏకంగా ఏడు కోట్ల రూపాయల విలువ చేసే ఒక కారును ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని మాత్రం త్రిష గోప్యంగా ఉంచింది.
కాగా కొంతకాలంగా వరుణ్ మణియన్‌కు, తనకు మధ్య సంబంధం ఉన్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ వాస్తవం కాదని ఖండిస్తూ వచ్చిన త్రిష ఇపుడు పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించడం గమనార్హం.
More News Click Here