Sunday, 18 January 2015

బస్సులో గోపాలా గోపాలా షో... పట్టుకున్న పోలీసులు

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్-విక్టరీ వెంకటేష్ జంటగా నటించిన మల్టీస్టారర్ మూవీ గోపాలా గోపాలా సినిమా పైరసీ సీడీలు బయటకు వచ్చేశాయి. సినిమా రిలీజ్ అయిన సాయంత్రానికే సినిమా పైరసీ కాపీలు మార్కెట్లోకి రావడంతో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. తాజాగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న ధనుంజయ్ ట్రావెల్స్ బస్సులో గోపాలా గోపాలా పైరసీ సీడీని ప్రయాణికుల కోసం ప్రదర్శిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నల్గొండ జిల్లా కోదాడ వద్ద బస్సు ఆపగా ఈ విషయం వెల్లడైంది. సీడీలను సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఇలా కొత్త సినిమాల సీడీలను ప్రదర్శిస్తున్న ట్రావెల్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంపిణీదారులు డిమాండ్ చేస్తున్నారు.

Popular Posts