టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ నటించిన 'పటాస్' చిత్రానికి సెన్సార్ బోర్డు 'ఎ' సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ నెల 23వ తేది విడుదల సిద్ధమైన ఈ చిత్రం ఇటీవల సెన్సార్‌కు వెళ్లగా, చిత్రంలోని డైలాగ్‌లపై సెన్సార్ బృందం కన్నుపడింది. దీంతో చిత్రంలో ఉన్న పలు వివాదాస్పద డైలాగ్స్‌లను గుర్తించి వాటిలో కొన్నిటిని మ్యూట్ పెట్టి, 11 కట్స్‌ను సెన్సార్ బోర్డు విధించినట్టు చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది.
కళ్యాణ్ రామ్ ఈ సినిమాను సొంతంగా తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మించాడు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ రచయిత అనీల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఇందులో ఒక పవర్ ఫుల్ పోలీసు అధికారికాగ కళ్యాణ్ కనిపిస్తాడు. గత కొంత కాలంగా ప్లాఫులతో ఉన్న క్రుంగిపోయిన కల్యాణ్ 'పటాస్' పైనే ఆశలు పెట్టుకున్నారు. అందువల్లనే సినిమా పబ్లిసిటీలో ఎన్టీఆర్‌ను కూడా ఆహ్వానించారు. దీంతో ఈ చిత్రానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆదరణ కూడా ఉండవచ్చనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
ఇక సెన్సార్ బోర్డు సభ్యులు మాత్రం ఈ చిత్రాన్ని లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్‌గా పేర్కొన్నట్టు సమాచారం. కాగా కళ్యాణ్ రామ్ సినీ కెరీర్‌లో భారీ అంచనాల నడుమ, పాజిటివ్ టాక్‌తో విడుదలకానుంది.