తన పరువంతా గంగలో కలిపేశారని, రికార్డు సర్వనాశనం చేశారని.. అసలు ఇంత చేయడం ఎందుకని విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాతాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
పదవీ విరమణ చేయడానికి ఇంకా ఏడునెలల గడువు ఉండగానే ఆమెను ఆ పదవి నుంచి తప్పించి, అమెరికా మాజీ రాయబారి సుబ్రహ్మణ్యం జైశంకర్ ను నియమించిన విషయం తెలిసిందే.
అయితే.. ఇదంతా చాలా దారుణమైన పద్ధతిలో చేశారని సుజాతా సింగ్ అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తాను సోషల్ మీడియాలో చెబుతానని అన్నారు.