తిరుమల: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ కుటుంబ సమేతంగా ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.
స్వామి వారిని దర్శించుకునేందుకు శనివారం సాయంత్రమే ఆయన తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... 'భక్తుల కోర్కెలు తీర్చే దేవుడు శ్రీవేంకటేశ్వరుడు. గతంలో నేను విద్యార్థిగా వచ్చి స్వామి ఆశీస్సులు అందుకున్నా. ఇప్పుడు నా కుటుంబంతో కలసిరావడం గొప్ప అనుభూతి..' అని అఖిలేశ్‌యాదవ్ చెప్పారు.
తనకు విద్యార్థిగా, వీఐపీగా స్వామిని దర్శించుకునే గొప్ప అవకాశం లభించిందన్నారు. ప్రత్యేకించి తమ బంధువులతో కలసిరావడం ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రజలందరికీ శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉంటాయని ఆకాంక్షించారు.