Sunday, 25 January 2015

ఒబామాకు స్వయంగా టీ కలిపిన మోడీ

న్యూఢిల్లీ: మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ప్రధాని నరేంద్రమోడీ తన అభిమానాన్ని అడుగడుగునా చాటుకుంటున్నారు. ఆదివారం ఉదయం పాలెం విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఒబామాకు ప్రధాని మోడీనే ప్రోటోకాల్‌ను సైతం మరిచి స్వయంగా ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే.

రాజ్ ఘాట్‌ను సందర్శించిన అనంతరం అమెరికా అధ్యక్షుడు ఒబామాతో ప్రధాని మోడీ హైదరాబాద్ హౌజ్‌లో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు. ఒబామాతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మోడీ ఆయనతో కలిసి 2.45 గంటలకు 'వాక్ అండ్ టాక్'లో పాల్గొన్నారు.

ఒబామా పర్యటన గురించి మరిన్ని విషయాలు 


ఈ సందర్భంగా ప్రధాని మోడీ.... ఒబామాకు స్వయంగా టీ కలిపి ఇవ్వడం విశేషం. తర్వాత హైదరాబాద్ హౌస్ ఆవరణలో ఇరు దేశాధినేతలు చర్చలు జరిపారు. దాదాపు రెండు గంటలపాటు వీరు పలు అంశాలపై చర్చలు జరిగాయి. మరికొద్ది సేపట్లో ఇద్దరూ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ ఆత్మీయ అతిథ్యానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముగ్దుడయ్యాడు.

Popular Posts