ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను స్మార్ట్‌గా మోసం చేస్తున్నారని వైకాపా నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారామ్ విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నవి, లేనట్లు, లేనివి ఉన్నట్లు చూపుతూ ప్రజలను భ్రమలలో ఉంచుతోందన్నారు.
అధికారం చేపట్టిన ఏడెనిమిది నెలల కాలంలో దావోస్, సింగపూర్, జపాన్ దేశాలను చంద్రబాబు పర్యటించారని, ఆ దేశాల నుంచి ఇంతవరకు ఎంత పెట్టుబడి వచ్చిందో చెప్పాలని సీతారామ్ డిమాండ్ చేశారు. ఎపిలో రూ.254 ఉండాల్సిన యూరియా బస్తాను తెల్లవారుజామున నుంచి క్యూలో నిలబడి నాలుగు వందల రూపాయలకు కొనాల్సి వస్తోందని, రైతులు తీవ్ర సమస్యలలో ఉన్నారని ఆయన అన్నారు. కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని న్నారు.
చంద్రబాబును కలిసేందుకే బిల్ గేట్స్ పడిగాపులు పడ్డారని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని వ్యంగ్యంగా చెప్పారు. బాబు అప్పాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వల్లే ఒబామా కూడా ఆయనను కలవలేదేమోనని సీతారామ్ ఎద్దేవా చేశారు.