‘డర్టీ పిక్చర్’తో కుర్రకారును హీటెక్కించిన బాలీవుడ్ నటి విద్యాబాలన్ తాజాగా చేసిన ఫొటోషూట్‌లో ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచడం పెద్ద చర్చకు దారితీసింది. కొన్ని రోజుల క్రితం విద్యాబాలన్ విలేకరులతో మాట్లాడుతూ... ‘‘2015 క్యాలెండర్ కోసం నేను చేయబోయే ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నానీ ఆధ్వర్యంలో ఫొటోషూట్ వార్తల్లో నిలవడం ఖాయం. మీరే చూడండి.. కావాలంటే నేను అన్నంత పనీ జరుగుతుంది’’ అన్నారు.
అన్నట్టుగానే ఈ ఫొటోషూట్ సంచలనానికి దారితీసింది. ఎందుకంటే, ఒంటి మీద కేవలం వార్తాపత్రికతో పోజులిచ్చారీ బ్యూటీ. ఈ పోజులు చూసినవాళ్లు ‘విద్యా చాలా హాట్ గురూ...’ అని అనుకోకుండా ఉండలేకపోతున్నారు.
అన్నట్టుగానే ఈ ఫొటోషూట్ సంచలనానికి దారితీసింది. ఎందుకంటే, ఒంటి మీద కేవలం వార్తాపత్రికతో పోజులిచ్చారీ బ్యూటీ. ఈ పోజులు చూసినవాళ్లు ‘విద్యా చాలా హాట్ గురూ...’ అని అనుకోకుండా ఉండలేకపోతున్నారు.