ఇప్పటివరకు ఎన్టీఆర్ సరసన చాలామంది హీరోయిన్లు చేసేశారు. దాంతో ఈసారి ఇప్పటివరకు అసలు చేయని, అందమైన హీరోయిన్ కోసం సుకుమార్ వెతికారని, సరిగ్గా అలాంటి కోవలోకి రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి చేరిందని ఈ సినిమా వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో హీరోయిన్ కు కూడా మంచి నటనకు అవకాశం ఉండటంతో ఆమెకు ఇది మంచి చాన్సు అవుతుందంటున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న టెంపర్ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు రకుల్ ప్రీత్ రవితేజ సరసన వస్తున్న కిక్-2లో నటిస్తోంది. వాళ్లిద్దరికి చేతిలో ఉన్న సినిమాలు అయిపోగానే సుకుమార్ సినిమా ప్రారంభం అవుతుందని అంటున్నారు.
1 BHK book only at Rs=30,000/- Click Here to Enquire!