Thursday, 22 January 2015

మన్మథుడి మరదలిగా

నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న తాజా చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ సినిమాలో నాగార్జున మరదలి పాత్రలో హాట్ యాంకర్ అనసూయ నటిస్తుందని లేటెస్ట్ ఫిల్మ్‌నగర్ టాక్. నాగార్జున, అనసూయల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని ఆమెను ఎంపిక చేశారు. ఓ పాటలో హీరోతో కలిసి అనసూయ స్టెప్పులు వేస్తుంది అని ఫిల్మ్‌నగర్ సమాచారం. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హంసానందిని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ‘ఉయ్యాల జంపాలా’ నిర్మాత రాధామోహన్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత. ‘హలోబ్రదర్’ తరహాలో వినోదాత్మక సినిమా అని సమాచారం.

Popular Posts