Posts

Showing posts from November, 2025

SBI పోర్టల్‌కు "ఐ బొమ్మ" లింక్!!

Image
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా "ఐ బొమ్మ " వెబ్‌సైట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వెబ్ సైట్ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ ను అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచగా.. ఈ పైరసీ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే రవిని అరెస్ట్ చేసిన వెంటనే వెబ్ సైట్ ని బ్లాక్ చేసేశారు అధికారులు. కానీ ఐబొమ్మ తరహా లోనే మరో కొత్త వెబ్‌సైట్ తెరపైకి రావడం అది డైరెక్ట్ గా కొత్త సినిమాలను కూడా ప్రదర్శిస్తుండడం ఆందోళన రేకెత్తించింది. 'ఐబొమ్మ వన్' పేరుతో వచ్చిన ఆ వెబ్ సైట్.. మూవీరూల్జ్ వెబ్ సైట్ కి అది రీ డైరెక్ట్ అవుతూ సినిమాలను చూసేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. ఈ విషయంపై కూడా పోలీసులు దృష్టి సరిస్తున్న తరుణంలో ఇప్పుడు మరో బిగ్ షాక్ తగిలింది. SBI పోర్టల్‌కు లింక్.. ఐబొమ్మ వన్ వెబ్ సైట్ లో నుంచి పైరసీ సినిమాలను చూసేందుకు SBI పోర్టల్‌కు లింక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. బ్యాంకింగ్ వెబ్‌సైట్ వంటి అత్యంత రక్షణ గల ప్లాట్‌ఫాంలోకి పైరసీ లింక్‌ను చొప్పించడం వెనుక పైరసీ రాకెట్ ఎంత పెద్దదో అనే అనుమానాలను లేవనెత్తుతోంది. SBI term life insurance పోర్ట‌ల్‌కు ఐబొమ్మను లింక్ చేశారు...