Friday, 8 February 2019

మెట్రో రైల్వే స్టేషన్ ఎలివేటర్లు ప్రేమికులకు హాట్ స్పాట్... లిఫ్ట్‌ల్లో అధర చుంబనాలు

hyderabad metro rail - youth kissing in lift
hyderabad metro rail - youth kissing in lift
పార్కులు ప్రేమికుల రాసలీలలకు కేంద్రంగా మారిన నేపథ్యంలో.. తాజాగా మెట్రో రైల్వేస్టేషన్‌లోని లిఫ్టులు కూడా ముద్దుముచ్చటకు నిలయంగా మారిపోతున్నాయి. హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్‌లో వృద్ధులు, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్టులు ప్రేమికులకు అడ్డాగా మారుతున్నాయి. నాలుగు వైపులా.. మూతపడిపోవడంతో ఈ ఎలివేటర్లు ప్రేమికులకు హాట్ స్పాట్‌గా మారిపోతున్నాయి.

నిత్యం రద్దీగా ఉండే నగరంలో కాసింత ఏకాంతం కోరుకునే ప్రేమికులకు మెట్రో లిఫ్ట్‌లు ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తున్నాయి. ఈ లిఫ్ట్‌లలో సీసీటీవీలు ఉన్నాయన్న సంగతిని గుర్తించని ప్రేమికులు ఆ కాస్త సమయంలోనే ముద్దు ముచ్చట తీర్చుకుంటున్నారు.

ఇటీవల ఈ సీసీటీవీ ఫుటేజీలను గమనించిన సిబ్బంది అందులోని దృశ్యాలు చూసి షాక్ తిన్నారు. వెంటనే ఆ ఫుటేజీలను పోలీసులకు పంపారు. లిఫ్ట్‌లలో అధర చుంబనాలు కానిచ్చేస్తున్న వారంతా ఇంటర్, డిగ్రీ చదివే వారు కావడం గమనార్హం. ఇప్పుడీ దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే.. వైరల్‌గా మారిన ఈ వీడియోలు మెట్రో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో దీనిపై విచారణ చేస్తున్నట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. మెట్రో స్టేషన్లను అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Tags: hyderabad-metro-rail-lifts-a-lovebirds-haven, Hyderabad: Couples have been caught getting cozy in the elevators of Metro stations, as couples have been caught kissing on cameras

Popular Posts