Thursday, 9 May 2024

హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?

 హీరోయిన్ జాన్వీ కపూర్ ఫుల్ ఫామ్‌లో ఉంది. హిందీలో మీడియం బడ్జెట్ మూవీస్ చేస్తున్న ఈ భామ.. తెలుగులో ఎన్టీఆర్ 'దేవర', రామ్ చరణ్‌ 16వ సినిమాలో చేస్తోంది. అలానే ప్రేమ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడు శిఖర్‌తో రిలేషన్‌లో ఉంది. ఈ విషయాన్ని ఎక్కడ దాచలేదు. పలుమార్లు బయట కనిపించారు. కొన్నాళ్ల ముందు జంటగా తిరుపతి దర్శనం కూడా చేసుకున్నారు. తాజాగా వీళ్ల పెళ్లి గురించి ఓ న్యూస్ బయటకొచ్చింది.

జాన్వీ కపూర్ పెళ్లి తిరుపతిలో జరగనుంది. బంగారు రంగు చీర కట్టుకోనుంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా నాతో చెప్పింది' అని ఇన్ స్టాలో ఓ నెటిజన్స్ పోస్ట్ పెట్టాడు. ఇతడు జాన్వీ ఫ్రెండ్ కావడంతో నిజమేనేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఈ పోస్ట్‌కి రిప్లై ఇచ్చిన జాన్వీ.. 'ఏదైనా రాస్తారా' అని ఫైర్ అయింది. పలువురు నెటిజన్లు మాత్రం జాన్వీ పెళ్లిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'మీకు తెలియకుండానే మీ పెళ్లి చేసేస్తున్నారు', 'పెళ్లి చేసుకునే వరకు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు' అని రాసుకొస్తున్నారు


ఇకపోతే మహారాష్ట్ర మాజీ సీఎం సుశీష్ కుమార్ షిండే మనవడు అయిన శిఖర్.. ముంబయిలో బిజినెస్ చేస్తున్నాడు. కొన్నాళ్ల నుంచి జాన్వీ కపూర్‌తో రిలేషన్‌లో ఉన్నాడు. అతడితో బాండింగ్ గురించి జాన్వీ కూడా పలుమార్లు బయటపెట్టింది. అయితే ఇప్పుడు పెళ్లి గురించి గోల ఎక్కువైంది. అయితే జాన్వీ కెరీర్ పరంగా చూస్తే ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకోకపోవచ్చనిపిస్తోంది

Popular Posts