Friday 3 September 2010

‘ఓదార్పు’

‘ఓదార్పు’ టూరిజం

ట్రావెల్ ఎజెన్సీల దగ్గర ఈమధ్య విపరీతంగా జనం. ఉప ఎన్నికల కాలం కాబట్టి సహజమేనని ముందు ఎవరూ పట్టించుకోలేదు. ఈవెంట్ మెనేజర్ల దగ్గరా అదే పరిస్తితి.తీర్దయాత్రలకాలం కాబట్టి ఇదీ సహజమేనని ఎవరూ పట్టించుకొలేదు. పెళ్ళిళ్ళు,వార్షికొత్సవాలూ జరిగేకాలమూ కాదు.
బస్టాండులకు వెళ్ళినా,రైల్వే స్టేషన్లకు వెళ్ళినా సేం టు సేం.టిక్కెట్లన్నీ ఎప్పుడో అయిపోయాయి.పైగా బస్సులు బస్సులుగా,బొగీలు బొగీలుగా రిజర్వు అయిపోయి ఉన్నాయి.
ఏమిటీ జనం ఇంతలా టురిజం మీద పడ్డారు ?
అని ప్రభుత్వం,దాని అధికారులు కాస్త ఆశ్చర్యపోయారు.బాధలకు,ఎండలకు,వానలకూ తట్టుకొలేక తిరుపతి,కాశీ,షిర్డీ,పూరి జగన్నధ యాత్రలకో,అమరనాధ యాత్రలకో పొతున్నట్టున్నారు అనుకున్నరు వాల్లంతా. కాని జనం వెలుతున్న ఊర్ల పేర్లు చూసి మహా ఆశ్చర్యపోయారు.ఆ ఊళ్ళలో టురిజం ఏముందీ.. అందులొనూ వానాకాలంలొ?
ట్రవెల్ ఎజెన్సీల వాళ్ళనడిగారు.బస్సు ఆపరెటర్ల నడిగారు.ఈవెంట్ మెనెజర్ల నడిగారు.అందరూ రెట్లు,ఏర్పాట్ల గురించె చెప్పారు.కుటుంబాలకు కుటుంబాలు,ఊళ్ళకు ఊళ్ళు వెలుతున్నరు ఏమిటీ సంగతీ అనడిగారు.
‘ఓదార్పు యాత్ర’ చెప్పారు వాళ్ళు.‘ఎవర్ని ఓదార్చటానికీ?’
‘మాలాగే నీళ్ళు దొరక్క ఇబ్బంది పడుతున్న జనాన్ని,
మాలాగే గిట్టుబాటు ధరలు దొరక్క అవస్తలు పడుతున్న రైతుల్ని,
మాలాగే వైద్యం దొరక్క కష్టపడుత్టున్న ప్రజల్ని,
మాలాగే అధిక దరలతొ సతమతమవుతున్న మనుషుల్ని,
మాలాగే అప్పుల్లొ కూరుకుపోయిన ప్రజానికాన్ని,
మాలాగే భూములు కోల్పోతున్న భాదితుల్ని
పరామర్శించడానికి,ఓదార్చటానికి,ధైర్యం చెప్పటానికి వెళుతున్నాం’
అనిచెప్పారు వాళ్ళు.