Sunday, 11 November 2018

2 ఓను లీక్ చేస్తామంటున్న తమిళ్ రాక్స్

శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తాజా సినిమా 2.ఓ త్వరలో రాబోతుంది. అయితే ఈ సినిమాని లీక్ చేస్తామంటూ పైరసీ వెబ్ సైట్ తమిళ్ రాక్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. తమిళ్ రాక్స్ లో 2.ఓ త్వరలో రాబోతుందని ప్రకటించింది. దాంతో రజనీకాంత్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కోట్లు పెట్టి సినిమా తీస్తే ఇలా చేయడం మంచిది కాదని అంటున్నారు. విజయ్ హీరోగా నటించిన సర్కార్ సినిమాని కూడా తమిళ్ రాక్ లీక్ చేసింది. అంతేకాదు బాలీవుడ్ సినిమా థగ్స్ అఫ్ హిందుస్థాన్ ను కూడా తమిళ్ రాక్స్ లీక్ చేసింది. ఒకవేళ నిజంగానే తమిళ్ రాక్స్ సినిమాని ఆన్లైన్ లో లీక్ చేస్తే తమిళ నిర్మాతలకు చాలా నష్టం జరుగుతుందని అంటున్నారు.

Popular Posts